Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెదక్డెస్క్
జిల్లాలో ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్హాలు నుంచి అదనపు కలెక్టర్ ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలు, మండల ప్రత్యేకా దికారులు, నియోజక వర్గ ప్రత్యేక అధికా రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, హరిత హారం, దళితబంధు, పారిశుధ్యం, మన ఊరు మనబడి పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రాజార్శి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలను వేగవంతంగా పూర్తి చేసేలా చొరవ చూపాలన్నారు. జిల్లాలో తెలంగాణ క్రీడా ప్రాంగ ణాలు వేగవంతంగా పూర్తి కావాలన్నారు.స్థలం లేక జాప్యం జరుగొద్దని, ప్రత్యామ్నాయ స్థలాన్ని గుర్తించి వెంటనే పూర్తి చేయాలన్నారు. కాంపోనెంట్స్ యువత, స్థానికుల ప్రాధా న్యత మేరకు ఏర్పాటు చేయాలన్నారు.క్రీడా ప్రాంగణాల పనులు నాణ్యతగా ఉండాలని స్పష్టం చేశారు. జిల్లాకు కేటాయించిన హరిత లక్ష్యం మేరకు వంద శాతం పూర్తి చేయాలన్నారు. మనఊరు-మనబడి పనులు త్వరితగతిన పూర్తి కావాలన్నారు. పూర్తయిన పనులకు వెంట వెంటనే ఎంబి పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచిం చారు. గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా జరగాలన్నారు. చెత్త అమ్మకంతో గ్రామపంచా యతీకి రెగ్యులర్గా ఆదాయం వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వైకుంఠధామాలు, వైకుంఠ రథాలు వినియో గంలోకి తీసుకురావాలన్నారు. దళితబంధు పథకంలో లబ్ది పొందిన లబ్దిదారుల వద్దకు వెళ్ళి వారు తీసుకున్న యూనిట్ తో పొందుతున్న లబ్ది,వారి జీవన స్థితిగతులను పరిశీలించి నివేదికను సమర్పించాలని మండల ప్రత్యేక అధికారులకు సూచించారు. ఆయా అధికారులు వారి ఉన్నతికి అన్ని విధాల సలహా సూచనలు ఇస్తూ ప్రోత్సహించాలని కోరారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీపీఓ ప్రసాద్, నియోజకవర్గ ప్రత్యేక అధికా రులు,మండల ప్రత్యేక అధికా రులు, డీఎల్పీఓలు, ఎంపీఓలు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.