Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే కొత్త పాసుబుక్స్ ఇవ్వాలి
నవతెలంగాణ-జహీరాబాద్
టీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జహీరాబాద్ డివిజన్లోని రైతులందరికీ తక్షణమే పట్టా పాస్‌బుక్కులను ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రవ ుంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రాంచందర్, ఎం. నర్సిం లుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి జి. జయరాజుతో కలిసి ఆమె మాట్లాడారు. జహీరాబాద్ డివిజన్ పరిధిలో ఫారెస్టు, వక్ఫ్ భూముల పేరుతో ప్రభుత్వం కావాలని కొత్త పాస్‌బుక్స్ ఇవ్వకుండా రైతులను ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. గతంలో పట్టా పాస్‌బుక్స్ ఉండి రెవెన్యూ రికార్డులో హక్కు దారులుగా ఉన్నప్పటికీ.. కొత్త పాస్‌బుక్స్ ఇవ్వకుండా రైతుల ను ఇబందులు పెట్టడం దుర్మార్గమన్నారు. నిత్యం రైతుల గురుంచి మాట్లాడే ప్రభుత్వానికి జహీరాబాద్ రైతులు కనిప ించడం లేదా అని ప్రశ్నించారు. ఇక్కడి రైతులకు రైతు బంధు, రైతు బీమా, బ్యాంక్‌లో రుణాలు రావడం లేదని మరి ఈ రైతులు ఎట్లా బతుకుతున్నారన్నారు. ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కొత్త పాస్‌బుక్స్ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో పాస్‌బుక్స్‌పై ప్రభుత్వం స్పస్టమైన నిర్ణయం తీసుకోకపోతే ఉద్యమం ఉదృతం చేస్తామన్నారు. సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్ మాట్లాడుతూ.. వారం రోజుల్లో రైతులకు కొత్త పాస్‌బుక్స్ ఇవ్వకపోతే నిరాహారదీక్షలు, రాస్తారోకో, జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాద యాత్ర, ఆమరణ నిరాహారదీక్షకు సైతం వెనుకడేదే లేదని స్పష్టం చేశారు. మాచిరెడ్డిపల్లి, బిడేకన్య, గుడుపల్లి, కాశింపుర్, గోపాన్ పల్లి, చిరగ్ పల్లి,సత్వర్,అల్ గోల్, ఔరంగా నగర్ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు చంద్రన్న, సంగన్న, శ్రీనివాస్, కౌడి నర్సింలు, ప్రకాష్, నర్సింలు, సంజీవ్, మల్లేష్, అనివిరప్ప పాల్గొన్నారు.