Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి
- వివిధ కార్మిక సంఘాల డిమాండ్
నవతెలంగాణ-ఐడిఏబొల్లారం
కార్మిక చట్టాలను సవరించొద్దని, నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. కార్మిక వ్యతిరేక విధానాలను మోడీ ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని పలు తీర్మానా లు చేశాయి. బొల్లారంలో సీఐటీయూ, టీఆర్ఎస్కెవీ, హెచ్ఎంఎస్ తదితర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక చర్యలను ఉపసంహరించుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది. అలాగే కార్మిక చట్టాల రక్షణ కోసం వివిధ రూపాల ఆందోళన చేయాలనీ, బొల్లారం ప్రాంతంలో కార్మికులను చైతన్యం చేయాలని తీర్మానం జరిగింంది. ఈ సందర్భంగా సీఐటీ యూ రాష్ట్ర కమిటీ సభ్యులు కే.రాజయ్య, టీఆర్ఎస్కేవీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి,
హెచ్ఎంఎస్ గోవిందరెడ్డి వివిధ యూనియన్ల నాయకులు పాల్గొని మాట్లాడారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను మార్చి, కార్మికులకు తీవ్రమైన అన్యాయం చేసిందన్నారు. పెట్టుబడిదారుల లాభాల కోసమే కార్మిక చట్టాలను సవరిసు ్తన్నారన్నారు. తక్షణమే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. యూనియన్ ఎన్నికలు, కార్మికుల సమ్మె, కనీస వేతనము, పరిశ్రమలను మూసివేయడం, తెరవడం, ఈఎస్ఐ, పీఎఫ్ తదితర వాటిని పెట్టుబడిదారులకు అ నుకూలంగా పూర్తిగా సవరించారని ఆరోపించారు. ఎంపీల బలం ఉన్నదని మోడీ ప్రభుత్వం నియంతృత్వం పోకడలకు పోతున్నదన్నారు. కార్మికులకు కనీస వేతనం రూ.7,000గా మోడీ ప్రభుత్వం ప్రతిపాదించడం అత్యంత దుర్మార్గ మన్నారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మికులందరూ ఏకతాటి మీదికి వచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ యూనియన్ల నాయకులు శ్రీధర్ రావు, భాస్కర్ రెడ్డి, మధు, శేఖరు, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.