Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆరు నెలల పీఆర్సీ ఏరియల్స్ వెంటనే చెల్లించాలి
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు
నవతెలంగాణ-సంగారెడ్డి
ఆశా వర్కర్లకు రూ.10వేల ఫిక్స్డ్ వేతనం ఇవ్వడంతో పాటు.. ఆరు నెలల పీఆర్సీ ఏరియల్స్ వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి.సాయిలు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం డీఎంఅండ్హెచ్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ గాయత్రి దేవికి వినతి పత్రం అందజేశారు. అనంతరం సాయిలు మాట్లాడుతూ.. ఆశా వర్కర్లు రోజుకు 10 గంటలు పనిచేస్తున్నారని.. ప్రభుత్వ పథకాల్లో భాగంగా అనేక సర్వేలు చేస్తున్నారని, కరోనా కాలంలో ప్రజలకు సేవ చేసినా ప్రభుత్వం వారిని పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారికి రూ.26 వేల కనీస వేతనమివ్వాలన్నారు. అప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నట్టుగా రూ.10 వేల ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.9750లు ప్రకటించినా అనేకమందికి రావడం లేద న్నారు. 32 రకాల రిజిస్టర్లు ఆశా వర్కర్లు రాస్తున్నారని కానీ ప్రభుత్వం రిజిస్టర్లు సప్లయి చేయడం లేదన్నారు. టీబీ రోగుల ఉమ్మిని స్కూటమి డబ్బాల్లో ఆశాలతో తెప్పించడం వల్ల రోగాలు వచ్చి ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆశా లతో స్కూటమీ డబ్బాలు తెప్పించే కార్యక్రమాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆశలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు. పెంచిన పీఆర్సీ ఏరియల్ ఆరు నెలల బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుంటే రాబోయే కాలంలో పోరాటం తప్పదని హెచ్చరించరు. సీఐటీయూ జిల్లా నాయకులు విద్యాసాగర్, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యద ర్శులు వరలక్ష్మి, యశోద, నాయకులు వీరమణి, గంగా, ప్రశాంతి, నందమ్మ, లక్ష్మి, రాధమ్మ, లక్ష్మీనరసింహ, ప్రసన్న, సుజాత, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.