Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిధులు దుర్వినియోగం అవుతున్నాయని ఉపసర్పంచ్ ఫిర్యాదుపై కదిలిన అధికారులు
నవతెలంగాణ-గుమ్మడిదల
మండలంలోని అన్నారం గ్రామ పంచాయతీలో అవినీతి జరుగుతున్నదని ఉపసర్పంచ్ మేడిపల్లి మురళి, వార్డు సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికార యంత్రాంగం కదిలింది. డీఎల్పీఓ సతీష్‌రెడ్డి, ఎంపీఓ దయాకర్ రావులు పాలకవర్గంతో కలిసి శుక్రవారం విచారణ నిర్వహించారు. సర్పంచ్ తిరుమలవాసు అవినీతికి పాల్పడ్డాడని, అక్రమంగా వెంచర్లకు అనుమతులు ఇచ్చాడని ఉపసర్పంచ్ ఆరోపిం చారు. ఆరోపణలకు సంబంధించి పత్రాలను విచారణ అధికారికి సమర్పించారు. ఉపసర్పంచ్ ఆరోపణలపై సర్పంచ్ తిరుమలవాసు వివరణ కోరగా.. అభివృద్ధి పనులను పంచాయతీ పాలకవర్గం, గ్రామసభల ఆమోదం తోనే చేపట్టామని.. లైసెన్స్ కలిగిన కాంట్రాక్టర్ ద్వారానే పాలకవర్గ సభ్యులు పనులు చేపట్టారన్నారు. ఎలాంటి అభ్యంతరాలు లేవని పాలకవర్గ సభ్యులు, ఉపసర్పంచ్ సంతకాలు చేసిన తర్వాతే అభివృద్ధి పనులకు పంచాయతీ రాజ్ శాఖ ఏఈయంబి రికార్డు చేశామన్నారు. అలాగే అక్రమ లేఅవుట్లపై ప్రభుత్వ నిబంధనల ప్రకారంచర్యలు తీసుకో వాలని ఈవోకు సూచించినట్టు తెలిపారు. అందులో తాను ఎప్పుడు అడ్డుపడలేదన్నారు. సీఎస్ఆర్ నిధులపై గ్రామస భలో చర్చించిన అనంతరమే పరిశ్రమల సహకారంతో అభివృద్ధి పనులు చేశామన్నారు. ఏదైనా అక్రమ వెంచర్లు తన ప్రమేయం ఉన్నట్లు నిరూపిస్తే చట్టం విధించే ఏ శిక్షకై నా తాను సిద్ధమన్నారు. డీఎల్పీఓ సతీష్‌రెడ్డి మాట్లా డుతూ.. ఉపసర్పంచ్ ఫిర్యాదుతో జిల్లా అధికారి ఆదేశాల మేరకు పంచాయతీలో విచారణ చేపట్టినట్టు తెలిపారు. ఉప సర్పంచ్, సర్పంచ్ వివరణ తీసుకొని పంచాయతీ రికార్డు లను స్వాధీనం చేసుకుని.. పై అధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపి చర్యలు చేపడతామన్నారు. వారం తర్వాత రికార్డులను తిరిగి పంచాయతీకి పంపిస్తామన్నారు. పంచా యతీ కార్యదర్శి శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు.