Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దాండియా, బతుకమ్మ వేడుకలు
నవతెలంగాణ-పటాన్చెరు
సృజనాత్మక వేడుకలు ఒత్తిడిని అధిగమించేలా చేస్తాయని, సుహృద్భావ వాతావరణాన్ని పెంపొంది స్తాయని, అంతిమంగా ఉజ్వల భవతకు బాటలు వేస్తాయని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీఎస్ రావు అన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్లోని అన్వేషణ, కళాకృతి విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో 'ధోల్ - ఎ - జర్న్' పేరిట శుక్రవారం వేడుక లను ఘనంగా నిర్వహించారు. విభిన్న సాంస్కృతిక, ఉత్సా హ పూరిత అంశాల మేళవింపుతో రూపకల్పన చేసిన ఈ ఒక రోజు కార్యక్రమాన్ని ప్రొఫెసర్ డీఎస్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎన్.సీతారామయ్యలు లాంఛనంగా ప్రారంభించారు. రోజువారీ కార్యకలాపాలకు భిన్నంగా నిర్వహించే ఇటువంటి సాంస్కృతిక పోటీలలో పాల్గొనడంతో ఒక రకమైన సుహృద్భావ వాతావరణం వెల్లివిరుస్తుందని, కొత్త అనుబంధాలకు దారితీస్తుందని వారు అభిప్రాయపడ్డారు. విద్యార్థులలో నిబిడీకృతంగా ఉన్న నైపుణ్యాలు వెలికితీసే వేదికలుగా సాంస్కృతి కోత్సవాలు తోడ్పడతాయని, మైత్రిభావంను పెంపొందించి, బృందాలు కలిసి పనిచేసే సంస్కృతికి బాటలు వేస్తాయని డైరెక్టరేట్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ సీనియర్ మేనేజర్ సమీర్ ఖాన్అన్నారు. ఈ ఒకరోజు వేడుకలలో భాగంగా దాండి యా, బతుకమ్మ, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఫుడ్ స్టాళ్లు, ఫోటోబూత్ వంటి పలు ఆకట్టుకునే అంశాలను అన్వేషణ, కళాకృతి విద్యార్థులు నిర్వహించారు. గీతం విద్యా ర్థులంతా ఎంతో ఉత్సాహభరింతగా వాటిలో పాల్గొని తమలో దాగివున్న ప్రతిభను చాటారు.