Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పట్టణ పెద్దల సమావేశంలో నిర్ణయం
- ఆనందోత్సాహాల మధ్య పండుగలు నిర్వహించుకోవాలి
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
నవతెలంగాణ-పటాన్చెరు
పటాన్చెరు పారిశ్రామికవాడలో వచ్చేనెల 3న బతుకమ్మ పండుగ, 5న దసరా పండుగను నిర్వహించు కోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర పెద్దల సమావేశంలో నిర్ణయించారు.శుక్రవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో పండుగ తేదీలపై నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అక్టోబర్ 3న పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై సద్దుల బతుక మ్మను నిర్వహించేలా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.దసరా పండుగను అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 05:00 గంటలకు జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ద్వజారోహన నిర్వహించి, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగ ణంలో శమీ చెట్టుకు పూజలు నిర్వహించాలని నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు మైత్రి మైదా నంలో రావణాసురుడి దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భం గా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర పెద్దలు, పురోహితులు పాల్గొన్నారు.