Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎదురు చూస్తున్న వేలాది మంది రైతులు
- పరిష్కారానికి చొరవ చూపుతున్న ప్రభుత్వం
- జిల్లా సమన్వయ కమిటీల వరుస బేటీలు
- భూమే జీవనాధారంగా ఉన్నవాళ్లకు న్యాయం
- జీపీఎస్ సిస్టం ద్వారా డిజిటల్ సర్వే
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
ఇకనైనా పోడు రైతుల గోస తీరేనా! పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా సమన్వయ కమిటీలను వేస్తూ జీవో ఇచ్చింది. ఈ మేరకు మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోడు రైతులకు న్యాయం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. మెదక్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించిన జిల్లా మంత్రి హరీశ్‌రావు నేడు సంగారెడ్డి జిల్లా కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. వరుసగా కమిటీల సమావేశాలు జరుగుతుండడం, మరో పక్క జీపీఎస్ ద్వారా డిజిటల్ సర్వే నిర్వహించేందుకు సిద్ధం చేయడంతో పోడు సమస్యలు తీరే రోజులు దగ్గర పడ్డాయనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులు హక్కు పత్రాల కోసం ఎదురు చూస్తున్నారు. భూమే జీవనాధారంగా జీవిస్తున్న నిరుపేదలు భూమిపై హక్కు కల్పించాలని కోరుతూ అనేక రూపాల్లో ఆందోళనలు చేశారు. ఫలితంగా ప్రభుత్వం గత నవంబర్‌లో సాగుదారుల నుంచి దరకాస్తుల్ని స్వీకరించిం ది. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో పెద్ద ఎత్తున పోడు రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. ప్రభుత్వం సానుకూలం గా అడుగులు వేస్తుండడంతో పోడుదారులు ఆశతో ఉన్నారు.
వేలాది మంది దరఖాస్తు
ప్రభుత్వం పోడుదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున 10 మండలాల్లోంచి దరఖాస్తులు వచ్చాయి. కల్హేర్, నారాయణఖేడ్, వట్పల్లి, మొగుడంపల్లి, చౌటకూరు, జహీరాబాద్, ఝరాసంగం, కోహీర్, హత్నూర్, సిర్గాపూర్ మండలాల్లో పోడు భూములున్నాయి. ఈ ప్రాంతాల్లో 2,168 మంది ఎస్టీలు దరఖాస్తు చేసుకున్నారు. వీరు సాగు చేసుకుంటున్న 4,129 ఎకరాలకు హక్కు పత్రాలివ్వాలని కోరారు. అదే విదంగా 1,768 మంది ఇతరులు తాము సాగు చేసుకుంటున్న 2,980 ఎకరాలకు హక్కు పత్రాలు ఇవ్వాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా 7,109 ఎకరాలకు హక్కు పత్రాలు కావాలని 3,934 దరఖాస్తులు వచ్చాయి. అదే విధంగా మెదక్ జిల్లా వ్యాప్తంగా 85 గ్రామాల్లోంచి పోడుదారులు దరఖాస్తు చేసుకున్నారు. 7,740 ఎకరాలకు హక్కు పత్రాల్విలని కోరుతూ 4,503 దర ఖాస్తులు వచ్చాయి. గత నవంబర్‌లో స్వీకరించిన దరఖాస్తు లన్నిటినీ గ్రామ స్థాయి కమిటీ రిజిస్ట్రేర్లో పొందుపరిచారు. సమాచారాన్ని కంప్యూటరీకరించారు. సమగ్ర వివరాలతో ఉన్నతాధికారులకు నివేదకలు అందజేశారు. అయితే మెదక్ జిల్లాలో 85 గ్రామాల పరిధిలోని 140 ఆవాస ప్రాంతాల్లో 4,606 ఎకరాలకు సంబంధించి 2,776 క్లైయిమ్లు సకాలం లో వచ్చినా ఆన్లైన్లో వివరాలు కనిపించడంతో పొందుప ర్చలేదు. 2005 కు ముందు అటవీ భూములి సాగు చేస్తున్న ట్లు ఉండాలి. కేసులుంటే వాటి పత్రాలను జతచేయాలి. గిరిజనేతులైతే మూడు తరాలకు సంబంధించిన ఆధారాలను చూపాల్సి ఉంటుంది. జిల్లా సమన్యయ కమిటీల వేస్తూ జీవో జారీ చేసింది. కమిటీలు జిల్లా స్థాయిలో చర్చించి పోడు సమ స్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా నిర్ణయాలు తీసుకుం టాయి. అయితే 2005కు ముందు నుంచే సాగులో ఉండాల నేది కాకుండా తెలంగాణ వచ్చే ముందు వరకూ సాగులో ఉన్నవారిని కూడా పరిశీలించే అవకాశముందని తెలుస్తోంది.
జీపీఎస్ ద్వారా డిజిటల్ సర్వే
జిల్లాలోని అటవీ భూముల్లో పోడు వ్యవసాయం ఎప్పటి నుంచో జరుగుతున్నందన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించేందుకు శాటిలైట్ మ్యాప్‌ల ప్రకారం సాంకేతికతతో జీపీఎస్ పద్దతి ద్వారా డిజిటల్ సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించి పక్కాగా ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలి. రెవెన్యూ, అటవీ శాఖ, సర్వే అధికారులు సమన్వయంతో డిజిటల్ సర్వే నిర్వహించి గ్రామాల వారిగా తీర్మానాలు పంపాల్సి ఉంది. పోడు భూములు సాగు చేస్తున్న నిజమైన గిరిజన, గిరిజనేతులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అందించేందుకు ఏలాంటి చిక్కులు లేకుండా క్షేత్ర స్థాయి నుంచే మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
వేగం పెరిగింది
పోడు భూముల సమస్యను కొలిక్కి తెచ్చే విషయంలో వేగం పెరిగింది. జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహిస్తూ తగిన సూచనలు చేస్తున్నారు. మెదక్ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం ఈ నెల 22న మంత్రి హరీష్‌రావు అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలో వచ్చిన 4,503 దరఖాస్తులకు సంబంధించి 7,740 ఎకరాల్లో పోడు వ్యవసాయం చేస్తున్నారు. భూమే జీవనాధారంగా జీవిస్తున్న వాళ్లకు పట్టాలిచ్చి ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అదే విధంగా సంగారెడ్డి పోడు భూముల సమస్యలపై చర్చించేందుకు జిల్లా సమన్వయ కమిటీ సమావేశం శనివారం సంగారెడ్డి కలెక్టరేట్లో నిర్వహించనున్నారు. వరుస బేటీలు జరుగుతుండడంతో పోడుదారుల్లో ఆశలు పెరుగుతున్నాయి. 2005 అటవీ హక్కుల చట్టం మార్గదర్శకాలకు లోబడి తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములకు హక్కు పత్రాలివ్వాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం వేసిన సమస్య కమిటీలపై అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు జోక్యం చేసుకోవాలని పలువురు పిటీషన్లు వేశారు. దీంతో కోర్టు విచారణ చేపట్టింది. దీంతో రాష్ట్రంలో పోడు భూముల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు న్యాయపరమైన చిక్కులు లేకుండా ముందుకు వెళ్లేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.