Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యత కార్యక్రమాలను జిల్లాలో త్వరితగతిన పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షిషా అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ వీడియో కాన్పరెన్స్ హాల్ నుంచి ఎంపీడీఓలు, ఎంపీఓలు, డీఎల్పీఓలు, మండల ప్రత్యేక అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, హరితహారం, దళిత బంధు, పారిశుధ్యం, మన ఊరు-మనబడి పనుల పురుగతిపై సమీ క్షించారు.ఈ సందర్భంగా రాజర్షి షా మాట్లాడుతూ జిల్లాలో క్రీడా ప్రాంగణాలు వేగంగా పూర్తి కావాలన్నారు. స్థలం లేక జాప్యం చేయకూడదన్నారు. ప్రత్యామ్నాయ స్థలాలను గుర్తించి వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మన ఊరు మన బడి కింద చేపట్టిన పనుల్ని పూర్తి చేయడంలో అలస త్వం ప్రదర్శిండం సరికాదన్నారు. దళిత బంధు యూనిట్ల ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఆదాయం, యూనిట్ల నిర్వహణ వంటి ఆంశాలను పరిశీలించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, డీపీఓ సురేష్మోహన్, డీఆర్డీఓ శ్రీనివాసరావు, డీసీఓ ప్రసాద్ పాల్గొన్నారు.