Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగిల్ ఇంజన్ సర్కార్ ఉన్న తెలంగాణలో 24గంటలూ ఉచితమే
- వైద్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
- జహీరాబాద్, మొగుడంపల్లి మండలాల్లో రూ.10.50 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
నవతెలంగాణ-జహీరాబాద్
కర్ణాటకలో డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ ఉన్నప్పటికీ మూడు గంటల విద్యుత్ సరఫరా, నెలకు రూ.600 పెన్షన్ మాత్రమే వస్తుంది.. కానీ తెలంగాణలో సింగిల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పటికీ 24 గంటల ఉచిత కరెంటు,నెలకు రూ.2000 ఆపై పెన్షన్లు వస్తున్నాయని వైద్య, ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జహీరాబాద్ నియోజకవ ర్గంలోని మొగుడంపల్లి, జహీరాబాద్ మండలాల్లో శనివారం మంత్రి పర్యటించి.. రూ.10 కోట్ల 50 లక్షల విలువగల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. నేడు ఎన్నికలు లేకపోయినా వివిధ రకాల జెండాలతో వివిధ రకాల ఎజెండాలతో డబుల్, సింగిల్ ఇంజన్ పేరు పెట్టి మభ్యపెట్టేందుకు నాయకులు వస్తున్నారని ప్రజలు జాగ్రత్త పడాలన్నారు. మొగుడంపల్లి మండల కేంద్రంలో ఐదు కోట్ల 70 లక్షలతో నూతనంగా నిర్మించిన ఎస్టీ గురుకుల పాఠశాల భవనాన్ని ప్రారంభిం చారు. అనంతరం ఆ మండలంలోని వివిధ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన కమిటీహాల్, సీసీ రోడ్లకు శంకుస్థా పనలు ప్రారంభో త్సవాలు చేశారు. జహీరాబాద్ పట్టణంల ోని హమాలీ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాలను ప్రారంభించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు జహీరాబాద్ ఓల్డ్ సిటీకి మరొక బస్తీ దవాఖానాను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఎంసీహెచ్ కేంద్రంతో 39 మంది డాక్టర్లు స్టాఫ్ నర్సులు నిరంతర సేవలు అందిం చేందుకు అందుబాటులోకి వస్తారన్నారు. జహీరాబాద్ వైద్యశాలకు అల్ట్రాసౌండ్ స్కానర్‌ను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అల్లానా పరిశ్రమ సహకారంతో రూపాయలు కోటిన్నరతో నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని ప్రారంభించారు. ఈ భవనంలో ఉర్దూ, తెలుగు మీడియం విద్యార్థులు విద్యను అభ్యసిస్తారన్నారు. ఉర్దూ మీడియం జూనియర్ కళాశాలను ఇక్కడి నుంచి తరలిస్తున్నట్టు జరుగు తున్న ప్రచారంలో సత్యం లేదన్నారు. జహీరాబాద్ పట్టణం లో మైనారిటీలకు ఐదు ఎకరాల స్మశాన వాటిక స్థలాన్ని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో 91 గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వాటిని 103కు పెంచడం జరిగిందన్నారు. 20 మహిళా డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలలు కూడా ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే లా మరియు పీజీ కళాశాలలో ఏర్పాటు చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 209 గురుకుల పాఠశాలలో ఉంటే నేడు 900 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుం దన్నారు. రాష్ట్రంలో మొత్తం ప్రతీ సంవత్సరం రూ.3,300 కోట్లు ఖర్చు చేసి విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నా మన్నారు. గీతారెడ్డి మంత్రిగా ఉన్నప్పటికీ నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. కోహిర్ మండల కేంద్రంలో త్వరలోనే 500 పడకల వైద్యశాలను ప్రారంభిసా ్తమన్నారు. కేవలం ఒక జహీరాబాద్ నియోజకవర్గం లోని రైతులకు రూ.742 కోట్ల రైతుబంధు ఆర్థిక సహాయాన్ని అందజేశామన్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 37,830 మంది లబ్ధిదారులకు 51 వేల కోట్ల పెన్షన్ డబ్బులు చెల్లిస్తున్నామని అన్నారు. మొగుడంపల్లి అభివృద్ధికి రూపాయలు కోటి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ.. తాను కూడా గిరిజన బిడ్డనే ఐదు కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి చదువుకున్నానని అన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న గిరిజన పాఠశాల భవనాలను చూస్తే మళ్లీ విద్యార్థిగా చేరాలనిపిస్తుందన్నారు. ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎంపీ బీబీ పాటిల్‌లు మాట్లాడుతూ.. రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా జరగడం లేదని.. అందుకే కేంద్ర ప్రభుత్వానికి సంబందించిన వివిధ శాఖల వారు రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డు ఇస్తున్నారన్నారు. జడ్పీ చైర్పర్సన్ మంజు శ్రీ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మెన్ శివకుమార్, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, రాజనర్సు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, ఆర్డీవో రమేష్ బాబు, సీడీసీచైర్మెన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ పెంటారెడ్డి, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్లకు సన్మానం..
జహీరాబాద్ కమ్యూనిటీ వైద్యశాలలో సాధారణ ప్రసవాలను పెంచి ఉత్తమమైన సేవలు అందించిన డాక్టర్ కిరణ్మై, డాక్టర్ ప్రతిభ పాటిల్, డాక్టర్ శేషులను పూలమాల శాలువాలతో మంత్రి సన్మానించారు. డీఎం అండ్‌హెచ్‌ఓ గాయత్రీ దేవి, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ శంకర్, మున్సిపల్ కమిషనర్ సుభాష్ రావు పాల్గొన్నారు.