Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండపాక
భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమంలో భగత్ సింగ్ పాత్ర ఎంతో కీలకమైందని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నే కుమార్ తెలిపారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారి రహమాన్‌కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహౌన్నతనమైన భగత్ సింగ్ చరిత్ర యావత్తు సమాజానికి తెలిసే విధంగా పాఠ్యాంశంలో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా లిఖించడంతో పాటు, భగత్ సింగ్ జయంతి (సెప్టెంబర్ 28), వర్దంతి (మార్చి 23)లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని, భగత్ సింగ్‌కు భారతరత్న ప్రకటించాలని, తెలంగాణ ప్రభుత్వం భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేయాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ ఆక్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చేర్యాల సాయికుమార్, ఖానాపురం రాజేష్, గంగనబోయిన శ్రీను, శివ, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.