Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల వైస్ ఎంపీపీ యంజాల విఠల్‌రెడ్డి
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
తెలంగాణ రాష్ట్రంలో ఆడపడుచులు ఆనందంగా బతుకమ్మ పంగను నిర్వహించుకోవాలనే ఆకాంక్షతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నట్టు మండల వైస్ ఎంపీపీ యంజాల విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం రోజు మనోహరాబాద్ మండలంలోని రంగాయిపల్లి గ్రామంలో సర్పంచ్ నాగభూషణం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వైస్ ఎంపీపీ ముఖ్య అతిథిగా హజరైన సందర్బంగా మాట్లాడుతూ ఆడపడుచులు పండగపూట కొత్త బట్టలు లేక ఇబ్బందులు పడకూడదని, పండగను ఆననేందంగా జరుకోవాలనే బతుకమ్మ పండగ కానుకలను అందజేస్తున్నట్టు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పధకాలను తీసుకువచ్చి అటు రైతు లను, వృద్దులను, ఆడపడుచులను ఆదుకుంటున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వాలలో వృద్దులకు ఆసరా పెన్షన్లను ఇవ్వలేని పరిస్థితి ఉండేదని కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత వృద్దులకు, వితంతువులకు, వికాలాంగులకు ఎక్కడా లేని విదంగా రెండు వేల నుంచి మూడు వేల వరకు ఇచ్చి ఆదుకుంటున్నట్టు తెలిపారు. ఆసరాతో వృద్దులలో ఆత్మగౌరవం పెరిగిందని తెలిపారు. అలాగే మండలంలోని పర్కిబండ గ్రామంలో సర్పంచ్ పూల అర్జున్ ఆధ్వర్యంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నవీన్‌తో పాటు వీవో సునిత, గ్రామ వార్డు సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.