Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం
నవతెలంగాణ-మెదక్ టౌన్
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతూ నిరుపేదలపై మోయలేని భారాన్ని మోపుతుందని వాటిని ప్రజలు ప్రతిఘటించాలని సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి మల్లేశం అన్నారు. సీపీఐ(ఎం) జాతీయ కమిటీ పిలుపు మేరకు శనివారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు గడిచినా సామాన్య ప్రజానీకాన్ని, సామాజిక అంశాలను మైనార్టీల సంక్షేమం, ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించకుండా దేశంలో మత సామరస్యాన్ని పెంపొందించే కేంద్ర ప్రభుత్వం వాటన్నింటినీ విస్మరించి దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తుందని, అంతేకాకుండా దేశంలోని నిరుద్యోగ యువకులను మోసం చేస్తుందన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిత్యావసరాలపై జీఎస్టీ విధించి ప్యాకింగ్ ఆహార పదార్థాలపై ఐదు శాతం నుంచి 12 శాతం, 15శాతం జీఎస్టీ పెంచిందని, పాలు, పాల ఉత్పత్తులతో పాటు అన్ని రకాల ఆహార ధాన్యాలపై 5 శాతం జీఎస్టీ విధించారని, బియ్యం, పసుపు, ఉడకబెట్టిన గుడ్లు, కూరగాయలు, ప్యాకింగ్ అల్లంలకు ఐదు శాతం పెంచడమే కాకుండా డ్రై ఫ్రూట్స్ పై 12 శాతం పిండివంటలకు 18 శాతం మజ్జిగ, లస్సీపై ఐదు శాతం జీఎస్టీ పేరుతో పన్నులు పెంచారని తెలిపారు. ప్రధానంగా డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరల పెరుగుదలకు కేంద్రం 31 శాతం డీలర్, నాలుగు శాతం రాష్ట్రం 23 శాతం పన్నులు విధించడం వల్ల లీటర్కు రూ.100 పెరిగిందన్నారు. వంట గ్యాస్ 2014లో రూ. 450లు ఉండగా సబ్సిడీ ఎత్తివేతతో నేడు రూ.1185 లకు చేరిందన్నారు. ధరల పెరుగుదలకు కారణమైన జీఎస్టీని రద్దు చేసి, గ్యాస్ సబ్సిడీని పునరుద్ధరించాలన్నారు. ఎన్నికల సమయంలో కోట్లాది ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అనేక ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చిన కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఏం సమాధానం చెబుతుందని, రోజురోజుకు దేశంలో కోట్లాది మంది నిరుద్యోగులు పెరిగి పోతున్నారని ప్రభుత్వ రంగాలను ప్రైవేటుపరం చేయడం వల్ల అణగారిన వర్గాలకు న్యాయపరంగా దక్కాల్సిన రిజర్వేషన్లు కూడా లేకుండా పోతున్నాయన్నారు. వీటిని ప్రజలందరూ గమనించాలని కోరారు. అలాగే ప్రధాన రంగాలైన విద్య, వైద్యాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పి ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను నిత్యావసర వస్తువుల ధరలను రెట్టింపు స్థాయిలో పెంచి ప్రజలను దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ బ్యాంకుల నుండి తీసుకున్న వేల కోట్ల రూపాయలను ప్రజల నుండి పన్నులు వేసిన డబ్బులను చెల్లించి పెట్టుబడిదారుల అప్పులను కేంద్ర ప్రభుత్వం మాఫీ చేసిందని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వాల పరిపాలనలో కొనసాగితే ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతారని దీన్ని ప్రజానీకం ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బసవరాజ్ పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు గీత, నాయకులు ప్రవీణ్, మల్లయ్య, ఎల్లేష్ తదితరులు పాల్గొన్నారు.