Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చిలిపీచేడ్, కౌడిపల్లి చెరువులను నింపుతా
- దసరా కానుకగా పార్టీలకతీతంగా ఇల్లు కట్టుకునే వారికి రూ. 3 లక్షలు
- నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి
- కేసీఆర్ పథకాలు దేశానికి ఆదర్శం
- రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి
నవతెలంగాణ - చిలిపీచేడ్
వృద్దులు, వితంతువులు వికలాంగులను ఆర్థికంగా ఆదుకునేందకే సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆసరా పెన్షన్ అందించి ఆదుకుంటుందని నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జెగ్గంపేట, అజ్జ మర్రి, బండపోతుగాళ్, ఫైజాబాద్, చిట్కుల్, చిలిపీచేడ్ గ్రామాలలో 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను అందజేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మదన్‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 వందలు ఉన్న పెన్షన్‌ను రూ.2 వేలకు పెంచి సమాజంలో వృద్దులకు, వికలాంగులకు విలువలను పెంచిందని ఆయన అన్నారు. గ్రామాలలో అర్హులుగా ఉండి పెన్షన్ రాని వారందరికీ తప్పకుండా పెన్షన్లు ఇప్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. మంజీరా నుంచి ఇరేగేషన్ లిప్ట్‌తో చిలిపీచేడ్, కౌడిపల్లి, చెరువులను నింపుతామన్నారు. మండలంలో నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకునేవారికి ప్రభుత్వం రూ.3 లక్షలు అందిస్తుందని, దశలవారీగా లబ్దిదారులకు అందిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణలో పెట్టిన ప్రతి పథకం ఆచరణ, ఆదరణ లభిస్తోందన్నారు. చిన్న పిల్లలకు పోషకాహారం అందించాలని చిన్న పాపకు బాలామృతం తినిపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అశోక్ రెడ్డి , ఎంపీపీ వినోద, వైస్ ఎంపీపీ విశ్వంబర్, పీఏసీఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, తహశీల్దార్ కమాలాద్రి, ఎంపిడిఓ శశి ప్రభ, సర్పంచులు లక్ష్మీ దుర్గారెడ్డి, కవితా ముకుందా రెడ్డి, బుజ్జి బాయి, మనోహర నర్సింహారెడ్డి, ఎంపీటీసీలు సుభాష్ రెడ్డి, మల్లమ్మ సంగాగౌడ్, సునీతా దేవుల, మల్లయ్య, సీనియర్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, బెస్త లక్ష్మణ్, విఠ్ఠల్ తదితరులు పాల్గొన్నారు.