Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐడిఏ బొల్లారం
బొల్లారం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. అనంతరం పెన్ష న్ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దశరథ్ (ఎం.ఆర్.ఓ), టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి, రాజేంద్ర కుమార్ (బొల్లారం మున్సిపల్ కమిషనర్), శ్రీధర్, (ఆర్.ఓ), కౌన్సిలర్లు గోపాలమ్మ , జయమ్మ, రాధా, చంద్రయ్య, కోప్షన్ సభ్యులు మనిమాలా, మునీర్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వి.యాదిరెడ్డి, వి.వరప్రసాద్ రెడ్డి, మున్సిపల్ అధికారులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.