Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.నర్సమ్మ
నవతెలంగాణ-హవేలీ ఘనపూర్
గ్రామ పంచాయితీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి కె.నర్సమ్మ అన్నారు. హావేలి ఘనపూర్ మండల గ్రామ పంచాయితీ కార్మికుల సమావేశం మండల కేంద్రంలోని ఎల్లమ్మ దేవాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటూ చాలీచాలని వేతనాలను చెల్లిస్తుందన్నారు. కరోనా కాలంలో ప్రాణానికి తెగించి ప్రజలకు సేవలు అందించారన్నారు. గత సంవత్సరంలో అన్ని తరగతుల ఉద్యోగులకు 30శాతం వేతనాలు పెంచి గ్రామ పంచాయితీ కార్మికులకు పెంచక పోవడం అన్యాయమన్నారు. 2019 నవంబర్లో రూ.8,500లు వేతనాలు పెరిగినప్పటికి అన్ని గ్రామాలలో అమలు కావడం లేదన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న వీరికి వేతనాలు అరకొరనే అందుతున్నాయన్నారు. కార్మికులకు అమలు చేయవలసిన మౌలిక వసతులు కూడా అందడం లేదన్నారు. జీ.ఓ 51 ప్రకారం ఎస్క్ డే పథకం కూడా అమలు కావడం లేదన్నారు. గ్రామ పంచాయితీ కార్మికులకు ప్రతినెలా 5వ తేదీ లోపల వేతనాలను చెల్లించాలని, మౌలిక వసతులు కల్పించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి నాగేందర్, మండల నాయకులు సంజీవులు, కార్మికులు రఘుపతి, నర్సింలు , సత్తయ్య, ప్రవీణ్, బుధమ్మ, మైసయ్య, రమేష్, పోచయ్య, మల్లయ్య, మరియమ్మ, రాజయ్య, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.