Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఊరూరా బతుకమ్మను ప్రారంభించిన టీపీసీసీ డెలిగేట్
- రాష్ట్ర కార్యదర్శి రవీందర్ రెడ్డి
- బతుకమ్మ ఆడియో సీడీని ఆవిష్కరించిన రచనా రెడ్డి
నవతెలంగాణ-నర్సాపూర్
టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి దివంగత నేత సోమన్నగారి లక్ష్మక్క ఆశయ సాధనలో భాగంగా ప్రతి సంవత్సరం నియోజకవర్గంలో పర్యటించే బతుకమ్మ సంబరాల ప్రచార వాహనాలను టీపీసీసీ డెలిగేట్ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి రవీందర్ రెడ్డి, రచనా రెడ్డిలు ఆదివారం నర్సాపూర్ పట్టణంలో లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు మహిళలకు చీరలను పంపిణీ చేసి లక్ష్మక్క ఆడియో సీడీని ఆమె కూతురైన రచనా రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రచనా రెడ్డి మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన తమతల్లి లక్ష్మక్క నేడు ప్రజల మధ్య లేకపోవడం అందరినీ కలిచివేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పనిచేసిన ఆమె ప్రతిఏటా ఆడపడుచుల కోసం బతుకమ్మ సంబరాలను పురస్కరించుకుని నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో 9 అడుగుల బతుకమ్మతో ప్రచార వాహనాల ద్వారా ప్రచారం చేసేవారని గుర్తు చేశారు. ఆమె ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ బతుకమ్మ ప్రచార వాహనాలను ప్రారంభించడం జరిగిందన్నారు. అలాగే తెలంగాణ సాంప్రదాయాలను ప్రజలు ఎప్పుడు మర్చిపోకూడదని తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలకు లక్ష్మక్క చేసిన సేవలు మరింతగా గుర్తింపునిస్తున్నాయని తెలిపారు. ఆమె పట్ల నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మల్లేశం, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, ఎంపీటీసీ లక్ష్మీ అశోక్, నాయకులు రాధాకృష్ణ గౌడ్, శ్రీశైలం యాదవ్ పాల్గొన్నారు.