Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్
నవతెలంగాణ-సిద్దిపేట
ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కారణాల చేత ఆత్మహ త్యలకు పాల్పడిన 100 మంది కౌలు దారు రైతన్నల కుటుంబాలకు చేయూతగా ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున చెక్కు లను అందిస్తున్నట్లు ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ తెలిపారు. స్థానిక కొండా భూదేవి గార్డెన్లో ఆదివారం వివిధ జిల్లాల నుంచి బాధిత కుటుంబాలకు చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ప్రచారం కోసం చేయడం లేదని, కేవలం రైతులను ఆదుకోవడం కోసం వచ్చామన్నారు. 350 మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ప్రతి దసరా, సంక్రాంతికి సహాయం అందిస్తున్నామని, డబ్బు సంపాదన విష యం కాదని, దాన్ని ఎలాగైనా సేవా కార్యక్రమాల్లో వినియోగించినప్పడే సార్ధకమవుతుందని అన్నారు. ఇంకా అవసరమైతే 500 మందికి ఇవ్వడానికైనా తాను సిద్ధమని, కొంతమంది తాను చేసే ఈ పని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు. ముఖ్యంగా నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు తయారు చేసే వారిని విక్రయించే వారిని కఠినంగా శిక్షించి వారిపై పిడి యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తాను రైతు సంక్షేమం కోసం పనిచేస్తానని అన్నారు. అంతకు ముందు బాధిత కుటుంబాలు తమ బాధలను వెల్లడించారు.ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు, వివిధ జిల్లాల నాయకులు పాల్గొన్నారు.