Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండాపూర్
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత 63రోజులుగా వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక దీక్షకు ఆదివారం సీఐటీయూ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం సీఐటీయూ మండల ప్రధా న కార్యదర్శి బాబురావు మాట్లాడుతూ.. వీఆర్ఏల సమ స్యలు పరిష్కరించాలని కోరుతూ 63 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నా.. ప్రభుత్వం ఏమాత్రం స్పందిం చక పోవడం సిగ్గు చేటన్నారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కా రం చేస్తామని చర్చల సందర్భంగా కేటీఆర్ ఇచ్చిన హామీలు సైతం అమలు నోచుకోకపోవడం దారుణమ న్నారు. వీఆర ్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించి సమ్మె విరమింప చేయాలని కోరారు. పిట్టల్లాగా వీఆర్ఏలు చనిపో తున్నా.. ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మండిప డ్డారు. చాలీ చాలని వేతనాలతో రాత్రి పగలు తేడా లేకుండా వీఆర్ఏలు కష్టపడుతున్నారన్నారు. అలాంటి వారిని ప్రభు త్వం గుర్తిం చకపోవడం సరికాదన్నారు. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దిగిరకపోతే వీఆర్ఏలను ఏకం చేసి హైదరాబా దులోని ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయ కులు, కుమార్, నర్సింలు, శ్రీశైలం, వీఆర్ ఏలు గోపాల్, సాయి, కవిత, మంజుల, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.