Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నారాయణఖేడ్
సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణఖేడ్ మండలంలోని జుకల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సరదర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గతంలో ఏ ప్రభుత్వం తీసుకురాని అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ తీసుకువ చ్చారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టని పథకాలు తెలంగాణలో అమలు అవుతున్నాయన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు గ్రామ గ్రామాన తిరుగుతూ సంక్షేమ పథకాలను అమలు పరచడం నిజంగా ఓ గొప్ప విషయవ ున్నారు. ఈ సంక్షేమ పథకాలు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరడం ఎంతో హర్ష నీయమన్నారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, అంబేద్కర్ భవన నిర్మాణనికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత పింఛన్లు పంపిణీ చేశారు. జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రాజు రాథోడ్, జెడ్పీటీసీ లక్ష్మీబాయి రవీందర్ నాయక్, మం డల పార్టీ అధ్యక్షులు పరమేష్, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ నర్సింహరెడ్డి, ఎంపీపీ తనయులు రమేష్ చౌహాన్,మండల నాయకులు బస్వరాజ్, తెరసవి నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షులు బిపెట్ సాయిలు, పభుత్వ న్యాయవాది లక్ష్మణ్ రావు గ్రామ పార్టీ నాయకులు దత్తు పాటిల్, పట్వారీ శంకరప్ప,కమ్మరి సాయిలు, శ్రీనివాస్, మనోహర్ రావు పాటిల్, మారుతి నాయక్, జీవ్ల నాయక్ తదితరులు పాల్గొన్నారు.