Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జహీరాబాద్
వారం రోజులపాటు స్కూళ్లు, పుస్తకాలతో కుస్తీ చేసిన చిన్నారులకు చిల్డ్రన్స్ హ్యాపీ సండే లాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడుతాయని.. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని సీనియర్ జర్నలిస్ట్ రవి కిరణ్ అన్నారు. ఆదివారం జహీరాబాద్ పట్టణంలోని శ్రామిక్ విజ్ఞాన్ భవన్లో ఏర్పాటుచేసిన చిల్డ్రన్స్ హ్యాపీ సండే కార్యక్రమంలో పెద్దఎత్తున చిన్నారులు పాల్గొని ఆటాపాటలతో సంతోషంగా గడిపారన్నారు. గత నాలుగు వారాలుగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి తాను వచ్చానన్నారు. వారమంతా పుస్తకాలతో, పెన్నులతో, బ్యాగులతో కుస్తీ పడే పిల్లలు సెల్ ఫోన్లకు దూరంగా ఉండేందుకు, పిల్లల్లో రకరకాల నైపుణా ్యలను పెంపొందించేందుకు హ్యాపీ సండే కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. శ్రామిక్ విజ్ఞాన కేంద్రం మరిన్ని ఇలాంటి కార్యక్ర మాలు నిర్వహించాలని, శ్రామిక్ విజ్ఞాన కేంద్రాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు పెద్దఎత్తున తమకు వచ్చిన డిజైన్లను పెయింటింగ్స్ వేయడం, కథల బుక్స్ చదవడం, పాటలు పాడటం, డ్యాన్సు లు వేయడం, ఆటలు ఆడటం చేస్తూ ఫుల్ ఎంజారు చేశార ు. ప్రముఖ వైద్యురాలు డాక్టర్ విజయలక్ష్మి, శ్రామిక్ విజ్ఞాన కేంద్రం, చిల్డ్రెన్స్ హ్యాపీ సండే నిర్వాహకులు ఎస్.మహిపాల్, దుర్గాప్రసాద్, రాజేష్, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.