Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వర్గల్
మండలంలోని మజీద్‌పల్లి గ్రామంలో ఆదివారం పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించారు. బీజేవైఎం వర్గల్ మండల అధ్యక్షుడు బబ్బులు రవీందర్ గౌడ్, మజీద్ పల్లీ బూత్ అధ్యక్షులు కారే శ్రీనివాస్ యాదవ్, క్రిష్ణ గౌడ్, లింగ సురేష్,నరేష్ గౌడ్, వెంకటేష్ గౌడ్, బీజేపీ మండల ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్ , నెంటుర్ బూత్ అధ్యక్షులు ప్రదీప్ గౌడ్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి కిచ్చుగారి పాండు, సోషల్ మీడియా కన్వీనర్ మధు గౌడ్ పాల్గొన్నారు.
నవ తెలంగాణ -గజ్వేల్: గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధి ముట్రాజ్‌పల్లి 05, 17 వార్డుల్లో బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వార్డులో మొక్కలు నాటారు. బీజేవైఎం సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మాదగారి మహేష్, గజ్వేల్ పట్టణ కిసాన్ మోర్చా అధ్యక్షులు మర్కంటి ఏగొండ, మర్కంటి రాములు, వైకుంఠం, ఎల్లయ్య పాల్గొన్నారు.
నవ తెలంగాణ-సిద్దిపేట : పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ విధానాలు అనుసరణీయమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆదివారం పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. బీజేపీ శ్రేణులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ గొప్ప మానవతావాది అన్నారు. దీన్ దయాల్ ఆశయాలకు అనుగుణంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా రంజక పాలనను అందిస్తుందన్నారు. పట్టణ అధ్యక్షుడు పత్రి శ్రీనివాస్ యాదవ్, గోనె మార్కండేయులు, తొడుపునూరి వెంకటేశం, విబిషన్ రెడ్డి, సత్యనారాయణ, దినేష్, యాదగిరి, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-దుబ్బాక రూరల్: పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలు మరువలేనివని పెద్ద గుండవెల్లి ఎంపీటీసీ పరికి రవి, రామసేన యూత్ అధ్యక్షులు గౌటి మహేష్ అన్నారు. దుబ్బాక మండల పరిధిలోని పెద్దగుండవెల్లి గ్రామంలో స్థానిక గాంధీ విగ్రహం వద్ద దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకొని ఆదివారం రామసేన యూత్, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ భారత రాజకీయ చరిత్రలో ప్రముఖ వ్యక్తులలో ఒకరని, ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 25న ఈ కార్యక్రమంలో చేపట్టామని అన్నారు. దివంగత పండిట్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ సేవలు, రచనలు అనిర్వచనీయమ న్నారు. యువజన సంఘ సభ్యులు బాయికడి లక్ష్మణ్, నవీన్, మహేష్, శ్రీకాంత్, వంశీ, బన్నీ, సాయి నగేష్ పాల్గొన్నారు.