Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
రాష్ట్ర ముఖ్యమఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హమీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల జాక్ ఇచ్చి పిలుపుతో చేపట్టిన ధీక్ష 64వ రోజుకు చేరుకుంది. సోమవారం రోజు ఉదయం నుండి స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరసన ధీక్షను చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే వీఆర్ఏలకు పేస్కేల్ అమలు చేయాలన్నారు. అలాగే 55 సంవత్సరాలు నిండిన వారి కుటుంబంలో ఒకరికి అవకాశం కల్పించాలని, అర్హత కలిగిన వీఆర్ఏలకు ఉద్యోగంలో ప్రమోషన్‌ను కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మన్, శ్రీనివాస్, బీబీ, విజయ్ తదితరులు పాల్గొన్నారు.