Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాపన్నపేట
ప్రసిద్ద పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీమాత సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం ఏడుపాయలకు చేరుకున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి శరన్నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. వన దుర్గా భవాని మాత ను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ మర్యాదల ప్రకారం పూర్ణకుం భంతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పాలక మండలి చైర్మన్ సాతెల్లి బాలా గౌడ్, ఆలయ కార్యిర్వహ ణాధికారి సారా శ్రీనివాస్, రైతు బంధు జిల్లా అధ్యక్షులు సోములు, పాపన్న పేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుమ్మరి జగన్, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ రాగి వనజ, నాగసాన్పల్లి సర్పంచ్ సంజీవరెడ్డి, టిఆర్ఎస్ నాయకులు బాలా గౌడ్ ,మల్లేశం, నవీన్, బాబర్ పటేల్, సాయి రెడ్డి పాల్గొన్నారు.
మొదటిరోజు శైలపుత్రిగా..
ఏడుపాయల వన దుర్గ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు సోమవారం శైలపుత్రి గా దర్శనమి చ్చారు. కార్యక్రమాన్ని తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.
నేడు బ్రహ్మచారిని రూపంలో..
రెండో రోజైన మంగళవారం విదియను పురస్కరించ ుకొని బ్రహ్మ ఛారిని దేవి (గులాబీ రంగు పట్టువస్త్రాలతో) రూపంలో అమ్మవారు దర్శనమివ్వను న్నాట్లు ఆలయ ఈవో సార శ్రీనివాస్ వెల్లడించారు.