Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మెదక్ రూరల్
జన్మనిచ్చిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడు కోవాలని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయో వృద్ధుల వారోత్సవాలలో భాగంగా సోమవారం ప్రజావాణి హాల్లో మహిళా శిశు సంక్షేమం వికలాంగుల వయోవృద్ధుల శాఖా ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై రూపొందించిన గోడ పత్రికను జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవమాసాలు మోసి కనీపెంచిన తల్లిదండ్రులకు పిల్లలు ఎంత చేసినా తక్కువేనని వృద్ధా ప్యంలో ఉన్న తల్లిదండ్రుల పోషణ, సంరక్షణ బాధ్యత పూర్తి వారిదేనన్నారు. వయోవద్ధుల చట్టం కూడా వారికి రక్షణ నిలుస్తున్నదని ఎవరైనా తల్లిదండ్రుల పట్ల అమానుషంగా ప్రవర్తించినా.. పోషణ భాద్యతలు విస్మరించిన చర్యలు తప్ప వని హెచ్చరించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులను చక్కగా చూసుకంటామని అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ మాట్లాడుతూ తల్లితండ్రులు వయోవద్ధుల సంరక్షణ అందరిదని తెలుపుతూ వారి ఆరోగ్య పరిరక్షణకు సూచనలు, తల్లిదండ్రులు వయో వద్ధుల పోషణసంక్షేమ చట్టం పై అవగాహన కలిగించారు. డిఆర్డిఓ శ్రీనివాస్ ఇతర జిల్లా అధికారులు సంక్షేమ శాఖా సిబ్బంది శ్యామ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.