Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
రాష్ఠ్రంలో ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడవద్దనే లక్ష్యంతో వైద్యం కోసం కార్పోరేట్ ఆసుపత్రులలో వైద్యం చేయించుకున్న ప్రతీ ఒక్కరికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎంఆర్ఎఫ్తో ఆదుకుంటున్నట్టు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం శివ్వంపేట మండలం చెంది గ్రామానికి చెందిన పుష్పలతకు సీఎంఆర్ఎఫ్ ద్వార మంజూరైన రూ40 వేల చెక్కును ఆమె తన నివాసంలో అందజేశారు. ఈ సందర్బ ంగా ఆమె మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేపట్టని విదంగా అనేక సంక్షేమ పథకాలను తీసుకువస్తూ దేశంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదర్శంగా నిలిచారన్నారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలోని సంక్షేమ పథకాలను కాపి కొట్టే స్థితికి తీసుకువచ్చినట్టు తెలిపారు. నిరుపేదలు మెరుగైన వైద్యం కోసం కార్పోరేట్ ఆసుపత్రు లలో వైద్యం చేసుకుని ఆర్ధికంగా ఇబ్బందులు పడే ప్రతి ఒక్కరిని రాష్ట్ర ముఖ్యమంత్రి సహయ నిధి ద్వార ఆదుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షులు, గౌతోజిగూడ ఉపసర్పంచ్ పంచమి రేణుకుమార్, టీఆర్ఎస్ నాయకులు మల్లేష్లు ఉన్నారు.