Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేక్మాల్
ఇటీవల మరణించిన వారి కుటుంబాలను పరామర్శిం చేందుకు టేక్మాల్ మండల పరిధిలోని ఏలూరు ఏలూరు వెంకటాపూర్ షాబాద్ ఎల్లంపేట, చెరువు ముందరి తండాల లో సోమవారం మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ పర్యటించారు. మరణించిన కుటుంబాలను పరా మర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అనంతరం వారి కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యత్వం ఉన్న వారి కుటుంబా లకు రూ.2 లక్షల చొప్పున ఇస్తానన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీయేనని.. రాహుల్ గాంధీ భరోసా ఇచ్చారన్నారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెంబర్ రమేష్. జెడ్పీటీసీ సర్వం సరోజా, వైస్ ఎంపీపీ మంజుల. విష్ణువర్ధన్ రెడ్డి భక్తుల కిషోర్, తదితరులు ఉన్నారు.