Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వెల్దుర్తి
చాకలి ఐలమ్మ 127 వ జయంతి సందర్భంగా మండల పరిధిలోని మానేపల్లి గ్రామంలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని నర్సాపూర్ శాసనసభ్యులు మదన్ రెడ్డి, ఎంపీపీ స్వరూప నరేందర్ రెడ్డి స్థానిక సర్పంచి వెంకట లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి రజక సంఘం నాయకులతో కలిసి సోమ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ.. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకుసాగాలన్నారు. రజక సంఘం నాయకులతో పాటు జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, టీిఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాప్, తాసిల్దార్ సురేష్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.
పెద్ద శంకరంపేట : పెద్ద శంకరంపేట ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ చిత్రపటానికి ఎంపీపీ జంగం శ్రీనివాస్ పలువురు ప్రజా ప్రతినిధులు అధికారులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు వీణ సుభాష్ గౌడ్ స్వప్న రాజేశ్వర్ దత్తు, రజక సంఘం బాధ్యులు చాకలి నారాయణ, సాయి,రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
చేగుంట : బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్యసాహసాలు, ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలి చాయని చేగుంట మండల ఎంపీపీ మాసుల శ్రీనివాస్ అన్నారు. చేగుంట పట్టణ కేంద్రం మెదక్ రోడ్ గాంధీ చౌరస ా్త వద్ద చాకలి ఐలమ్మ పూలమాల వేశారు. నర్సింగ్ పట్టణ కేంద్రంలో రజక సంఘం, మాజీ టెలిగ్రామ్ బోర్డు మెంబర్ రాజేష్, స్థానిక ఎస్సై నర్సింలు ఐలమ్మ విగ్రహానికి పూలవ ూల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ మంచి కట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, టిఆర్ఎస్ నాయక ులు, రజక సంఘం నాయకులు, పలువురు పాల్గొన్నారు.
టేక్మాల్ : రజాకార్ల రాక్షస గుండెల్లో గుబులు పుట్టించిన తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ 127 వ జయంతిని టేక్మాల్‌లో సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఆల చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా జయ ంతి వేడుకలు జరిపారు. సర్పంచ్ సుప్రజ, రజక సంఘం జిల్లా నాయకులు పాల్వంచ సాకలి సాయిలు, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు భక్తుల వీరప్ప, టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిన్న రమేష్ యువజన సంఘాల నాయకులు ఇంత రమేష్. బోట్ల సత్యం. సుధాకర్ పాపయ్య సుధాకర్ సార్ చాకలి యాదయ్య తదితరులు ఉన్నారు
నిజాంపేట : మండల కేంద్రంలోని సాకలి ఐలమ్మ 137 వ జయంతిని నిజాంపేట గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయంలో ఐలమ్మ జయంతిని డిప్యూటీ తాసిల్దార్ గంగా ప్రసాద్ ఆధ్వ ర్యంలో నిర్వహించారు. రజక సంఘం నాయకులు లింగం, బాబు, మండల రజక సంఘం అధ్యక్షులు దుబ్బ రాజయ్య, మామిడాల రాజయ్య, బూరుగుపల్లి తిరుమలయ్య, చందు, లచ్చవ్వ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పాపన్నపేట : భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన యోధురాలి చాకలి ఐలమ్మ త్యాగాలను మరువలేనివని మండల రజక సంఘం అధ్యక్షుడు గోపాల్ పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రమైన పాపన్న పేట సుభాష్ చంద్రబోస్ కూడలి వద్ద చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహి ంచారు. ఇందులో భాగంగా ఐలమ్మ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివళులర్పించారు. కార్యక్రమంలో శ్రీకాంత్, వెంకటేశం,గోపాల్,ప్రభు,ప్రవీణ్, పీ రయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
రేగోడు : మండల కేంద్రమైన రేగోడు గాంధీ విగ్రహం వద్ద రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలనుఆమె చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు రాములు, ప్రశాంత్ ,తుకారం, నారాయణ ,తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్‌రూరల్ (మనోహరాబాద్) : తెలంగాణ సాయుద పోరాటయోధురాలు వీరవనిత చాకలి ఐలమ్మ 127వ చయంతి ఉత్సవాలను రజక సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. సోమవారం రోజు తూప్రాన్, మనోహ రాబాద్ మండల కేంద్రాలలో రజక సంఘం నాయకులు, టీఆర్ఎస్ నాయకులు చాకలి ఐలమ్మ చిత్ర పటానికి పూల మాలలో వేసి జయంతి వేడుకలను ఘనంగా జరుపు కున్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నాటి తెలంగాణ సాయుద పోరాటం గ్రామగ్రా మాలన సాగింది. రజాకార్ల అరాచకాలతో ఆగ్రహించిన ఎందరో త్యాగదనుల వీరోచిత పోరాటాలతో బానిస సంకెల్లు తెంచుకుందన్నారు. గుతుపల సంఘం జరిపిన పోరాటంలో అగ్రగణ్య వీరనారి చాకలి ఐలమ్మ నఅని కొనియాడారు. శాలివాహన అధ్యక్షులు దశరథ, మాజీ ఉపసర్పంచ్ చిట్కుల్ వెంకట్‌రెడ్డి, వార్డు సభ్యులు లాయిక్, ఆదిల్పటేల్, తాడెపు మహెందర్, రజక సంఘం కార్యదర్శి మల్లేష్, కమిటి సభ్యులు సత్యనారాయణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.