Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
కాల పరిమితి ముగిసిన జీవోలను వెంటనే సవరించాలని కలెక్టర్ ఆఫీస్ ఎదుట సోమవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బి మల్లేష్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో షెడ్యూల్ ఎంప్లాయిమెంట్స్లో కనీస వేతనాలు ప్రతి ఐదేండ్లకొకసారి సవరించాలన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సవరన జరగలేదన్నారు. వేతనం పెరగకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కనీస వేతనాల జీవోలు సవరణ చేసి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు కనీస వేతనాల జీవోలను గెజిట్ చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ ఏవోకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు, సీఐటీయూ జిల్లా నాయకులు కే. రాజయ్య, పి.భాగరెడ్డి, బి. రాజిరెడ్డి, ప్రసన్న రావు, భూషణం, సురేష్, శ్రీనివాస్ రెడ్డి, కృష్ణయ్య, జాంగిర్ గౌడ్, కార్మికులు పాల్గొన్నారు.