Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రామచంద్రాపురం
భారతి నగర్ డివిజన్ పరిధిలో ఎంఐజి సొసైటీ ఆఫీస్ వద్ద శేరి లింగంపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ అరేకపుడి గాంధీతో కలిసి కార్పొరేటర్ సింధు ఆదర్శ్‌రెడ్డి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్థిక స్తోమతతో పండుగకు కొత్త బట్టలు కొనుక్కోలేని పేద ఆడబిడ్డలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదుకుంటున్నారన్నారు. సంపన్నులతో సమానంగా పేదవారు సైతం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ వెంకన్న, మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్, నాగమ ణి, టీఆర్ఎస్ ఎం.ఐ.జి అధ్యక్షుడు భాస్కర్, సీనియర్ నాయ కులు తిలవాత్, సంపత్, చిన్న, మహిళ అధ్యక్షురాలు జ్యోతి, రాణి యాదవ్, శ్రీదేవి, అనిత, స్వర్ణ లత, లక్ష్మీ, బేబీ, రాధ, సంధ్య, మంజుల, నరేందర్ ,కాలనీ డైరెక్టర్లు సత్యనా రాయ ణ, సీనియర్ సిటిజన్ అధ్యక్షుడు రాధాకృష్ణ పాల్గొన్నారు.
నారాయణఖేడ్ : మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన మహిళాలకు ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బతుకమ్మ చీరలనుపంపిణి చేశారు.మండల ఎంపీడీవో, సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.