Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఝరాసంగం
సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని, ఇక్కడ అమలవుతున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమా లు అమలు చేస్తున్నదని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అన్నారు. సోమవారం ఝరాసంగం మండలంలో ఎమ్మెల్యే విస్తతంగా పర్యటిం చారు. కుప్పనగర్,కక్కర వాడ, ఝరసంగం, కమల్ పల్లి,తుమ్మన్ పల్లి, కప్పడ్, గుంతవ ుర్పలి గ్రామాల్లో నూతనంగా మంజూరైన లబ్ధిదా రులకు ఆసరా పెన్షన్ కార్డులు, ప్రతీ గ్రామానికి రూ.20 లక్షలతో సీసీరోడ్డు పనులు నిర్మించేందుకు నిధులు మంజూరయ్యా యని, వాటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతు ందని త్వరలోనే వాటిని పూర్తి చేయడం జరుగుతుం దన్నారు. తెలంగాణ రాక ముందు రూ. 200 పెన్షన్ను ఇచ్చే వారని, కానీ నేడు రూ. 2016, వికలాంగులకు రూ. 3016 పెన్షన్ వస్తున్నదన్నారు. జహీరాబాద్ నియోజకవ ర్గానికి 8,140 నూతన పింఛన్లు మంజూరయ్యాయని అందులో ఝరాసంగం మండలానికి 1,166 నూతన పెన్షన్స్ మంజూరయ్యాయన్నారు. జహీరాబాద్ నియోజక వర్గ అభివద్ధికి నియోజకవర్గంలోని 138 గ్రామాలకు రూ.20 లక్షల చొప్పున 27.60 కోట్ల ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. అనంతరం బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. తహసీల్దార్ తారసింగ్ మండల అభిరువుద్ది అధికారి సుజాత,సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు బొగ్గుల జగదీశ్వర్, సర్పంచులు లక్ష్మి బారు, మోహన్ రెడ్డి,పరమేశ్వర్ పాటిల్,నవాజ్ రెడ్డి,నంద కుమార్, సంపూర్ణ బారు,లక్ష్మి బారు, ఎంపీటీలు, రజిని ప్రియ సంతోష్ పాటిల్, టీఆర్ఎస్ నాయకులు బొగ్గుల సంగమేశ్వ ర్,రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు సుభాష్ రావు, నర్సిం లు పాటిల్, ఏజాజ్ బాబా, సంజీవ్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.