Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జిన్నారం
బంజారాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తూ.. వారి అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి తెలిపారు. మండల పరిధిలోని రాళ్ల కత్వ తాండాలో సోమవారం సంత్ సేవాలాల్ మహారాజ్ భవాని మాత విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ప్రతిస్టాపన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో బంజారుల కోసం ఈ కార్యక్రమాలు చేపట్టడంతో అందరూ ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గం పరిధిలోని 6 తాండాల్లో సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయాలను సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. బంజారాల అభివృద్ధితో పాటు నియోజకవర్గంలోని ప్రతీపల్లె అభివృద్ధికి ప్రణాళికలతోకార్యక్రమాలను చేపడుతున్నామన్నారు.
బంజారాలతో కలిసి ఎమ్మెల్యే నృత్యం..
పంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్టాపన, భవాని మాత ఆలయాల నిర్మాణ కార్యక్రమల్లో భాగంగా స్థానిక బంజారాలు ఎమ్మెల్యేమహిపాల్రెడ్డికి సాంప్రదాయబ ద్ధమైన రీతుల్లో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బంజారాల ప్రత్యేక నృత్య కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బంజా రాలతో కలిసి నృత్యం చేసి స్థానికుల్లో ఉత్సాహం నింపారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మెన్ కుంచాల ప్రభాకర్, టీిఆర్‌ఎస్ రాష్ట్ర నేత జిన్నారం వెంకటేష్‌గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, సంత్ సేవాలాల్ సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.