Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పుల్కల్
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సోమవారం పుల్కల్ ఉమ్మడి మండల పరిధిలోని బొమ్మ రెడ్డిగూడెం, లక్ష్మీ సాగర్, హనుమాన్ నాయక్ తాండా, లాల్సింగ్ తాండా, ముదిమాణిక్యం, బస్వాపూర్, రాయపాడు, మంతూర్, పెద్ద రెడ్డిపేట, పుల్కల్ గ్రామాల్లో నూతన ఆసరా పెన్షన్ పత్రాలను, బతుకమ్మ చీరలను ఎ మ్మెల్యే పంపిణీ చేశారు. చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలను అన్ని రంగాల్లో రాణించేందుకు ప్రభుత్వం ఎంతో కషి చేస్తున్న దన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు కుటీర పరిశ్రమ లు ఏర్పాటు చేసి.. ఎలాంటి కల్తీ లేకుండా స్వచ్ఛ మైన వస్తువులతో నాణ్యమైన సబ్బులు, సర్పులు, మంచినూనె, పలురకాల పప్పు ధాన్యాలు తయారుచేసి తక్కువ ధరకే ప్రజలకు అందించేలా ప్రోత్సహిస్తున్నదన్నారు. అంతేక ాకుండా 57 ఏండ్లు నిండిన ప్రతీ ఒక్కరికి పెన్షన్ అందే విధంగా చూస్తున్నామన్నారు. జెడ్పిచైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి, పుల్కల్ మండల అధ్యక్షురాలు చైతన్య విజయ భాస్కర్ రెడ్డి, పుల్కల్ తాసిల్దార్ పరమేశ్వర్, ఎంపీడీవో మధులత, టీిఆర్ఎస్ పుల్కల్ మండలాధ్యక్షులు మాచర్ల విజరుకుమార్, రైతు సమన్వయ సమితి మండల అధ్య క్షులు నరసింహారెడ్డి, ఆత్మ కమిటీ మండల అధ్యక్షులు యాదగిరి రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, టీిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.