Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం సైన్యం, రజాకార్లతో ఐలమ్మ చేసిన పోరాటం నేటికీ స్ఫూర్తిదాయకం. కష్టపడి పండించిన పంటను దొరలు ఎత్తుకెళ్తుంటే.. ప్రాణాలకు తెగించి కొడవలితో తిరగబడిన సాయుధ రైతాంగ పోరాట యోధురాలు ఐలమ్మ. కాగా ఐలమ్మ 127వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలేసి నివాళ్లర్పించారు.
- ఐలమ్మ స్ఫూర్తితోనే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేసీఆర్ స్వీకారం
- ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
- ఘనంగా ఐలమ్మ 127వ జయంతి వేడుకలు
నవతెలంగాణ-నారాయణఖేడ్
ఖేడ్ పట్టణంలోని వీరనారి ఐలమ్మ విగ్రహానికి నారా యణకేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సోమవారం పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. తెలంగాణ వీర వనిత, ధైర్య శాలి చాకలి (చిట్యాల) ఐలమ్మ అని కొనియాడారు. అనాడు నిరంకుశ నిజాం రజాకార్లను, దేశ్‌ముఖ్‌లను ఎదుర్కొన్నదన్నారు. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతిలను ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ ఉద్యమించారన్నారు. అనంతరం కల్హేర్ మండలంలోని బల్కంచెల్క తాండా వాసి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా డీటీఓ మూడ్ కిషన్.. భవాని మాత మాల ధారణలో స్వాముల బందంతో వారి స్వగ్రామం నుందివ్ మహా రాష్ట్రలోని తుల్జాపూర్లో గల భవాని మాత ఆలయం వరకు పాదయాత్ర ముగించుకున్న సందర్భంగా ఎమ్మెల్యేకి సంతు సేవాలాల్ మహారాజ్ చిత్రపటాన్ని బహుకరించారు. వారితో పాటుగా భవాని మాలాదరణ బందం సభ్యులు, స్థానిక ప్రజ ాప్రతినిధులు పాల్గొన్నారు. నారాయణఖేడ్ నియో జకవర్గంలోని శివార్ సందుల్ తాండాలో గల దక్షిణ కాళీ మాత ఆలయ స్థాపకులు జగదీశ్వర్ నంద్ మహారాజ్ పట్టణ ంలోని సేవాలాల్ చౌక్ నుండి శివా సందుతాండాలో కాళిక మాత మందిరం వరకు సంత్ సేవాలాల్ మహారాజ్ పల్లకితో పాదయాత్ర నిర్వహించారు. ఆ పాదయాత్రలో భాగంగా భోగ్ భాండార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. భవాని మాల ధారణ స్వాములు, స్థానిక ప్రజాప్రతినిధులు, బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు.
పుల్కల్ : పుల్కల్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, జెడ్పీ చైర్ పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి అన్నారు. ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి వారు పూల మాలలేసి విగ్రహా విష్కరణ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి తరాలకు తెలియ చెప్పాలన్న సమున్నత లక్ష్యంతో ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. విషయమన్నారు చాకలి ఐలమ్మ స్ఫూర్తితోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. ఇలాంటి విగ్రహాలు ప్రతీ గ్రామంలో ప్రతిష్టించాలన్నారు. పుల్కల్ తహసీల్దార్ పరమేశ్వర్, ఎంపీడీవో మధులత, పుల్కల్ మండల అధ్యక్షురాలు చైతన్య విజయ భాస్కర్ రెడ్డి, టీిఆర్‌ఎస్ మండల అధ్యక్షులు మాచర్ల విజరు కుమార్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు నరసింహారెడ్డి, ఆత్మ కమిటీ మండలాధ్యక్షులు యాదగిరి రెడ్డి, సర్పంచ్ శ్రావణ్ కుమార్, ఎంపీటీసీ శ్రీనివాస్ చారి, రజక సంఘం నాయకులు, ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
అమీన్పూర్ : భూస్వాములకు వ్యతిరేకంగా, బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన మహౌన్నత నాయకురాలు, స్ఫూర్తి ప్రదాత చాకలి ఐలమ్మ అని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కొనియాడారు. సోమవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. అమీన పూర్ మున్సిపల్ పరిధిలోని మండే మార్కెట్లో గల ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్ట పైన జాతీయ రహదారి పక్కన చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ నిర్వహించినట్టు తెలిపారు. నియోజకవ ర్గంలోని ప్రధాన ప్రాంతాల్లో ఐలమ్మ విగ్రహాల ఏర్పాటుకు కషి చేస్తున్నామన్నారు. అమీన్పూర్ మున్సిపల్ చైర్మెన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మెన్ నందారం నరసింహ గౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
జహీరాబాద్ : స్థానిక క్యాంపు కార్యాలయంలో ఐలమ్మ చిత్రపటానికి ఎమ్మెల్యే మాణిక్‌రావు పూలమాలలు వేసి నివా ళ్లర్పించారు. టీఆర్ఎస్ పట్టణ అద్యక్షులు సయ్యద్ మొహి వుద్దిన్, రజక సంఘం అధ్యక్షుడు సందీప్, సభ్యులు, ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు.
కొండాపూర్ : సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సంద ర్భంగా పార్టీ మండల కార్యదర్శి రాజయ్య మాట్లాడుతూ.. పంటలను దొరలు ఎత్తుకెళ్లాలని చూస్తే తిరగబడిన గొప్ప వీరనారీమణి ఐలమ్మ అని కొనియాడారు. నాడు నైజామ ులకు వ్యతిరేకంగా పోరాడి భూములు పంచిన ఎర్ర జెండా నేడు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతు న్నదన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు చొరవ చూ పవని, పోరాటాల ద్వారా ప్రభుత్వ మెడలు వంచి సమస్య లను పరిష్కరించుకోవాలన్నారు. మండల కమిటీ సభ్యులు అనంతయ్య ఆసిఫ్, అలీ, నరసింహులు పాల్గొన్నారు.
సంగారెడ్డి : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 127వ జయంతిని కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో కల్లుగీత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్. రమేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్, ఉపాధ్యక్షులు జంగన్న గౌడ్, రాజు గౌడ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు నక్క నాగరాజు గౌడ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభు గౌడ్, ఎంపీటీసీ నాగరాజు గౌడ్, నాయకులు రాజు గౌడ్, శివ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద గల ఐలమ్మ విగ్రహానికి సోమవారం పులమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫోరమ్ అధ్యక్షుడు శ్రీధర్ మహేంద్ర ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్‌కుమార్‌లు మాట్లాడుతూ.. ఐలమ్మ పేరును భవిష్యత్ తరాలు గుర్తించే విధంగా యూనివర్సిటీకి గానీ, ప్రభుత్వ పథకానికి గాని పెట్టాలని డిమాండ్ చేశారు. ఫోరమ్ ఉపాధ్యక్షుడు సజ్జాద్ ఖాన్, కార్యవర్గ సభ్యులు సాయి వరాల, సిహెచ్ మల్లేశం, రజక సంఘం యువ నాయకులు, టేక్మాల్ శివ, ప్రవీణ్, బిసి బహుజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
న్యాల్కల్ : మండలంలోని హద్నూర్ చౌరస్తాలో ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.రోజు రజక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి టెంకాయలు కొట్టి పూలతో నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల తెగువను ప్రపంచానికి చాటిన వీర వనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఎంపీపీ అంజమ్మ, హదునూర్ ఎస్సై వినరుకుమార్, ఎంపీటీసీ సలీం, ఉప సర్పంచ్ షబ్బీర్ ఖాన్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కల్ బెమల్ మహి పాల్, పీటర్, నిరంజన్ రెడ్డి, చంద్రప్ప, శేఖర్ రెడ్డి, సంజీవు, స్వామి దాస్, బక్కరెడ్డి, అనిల్, ఆసిఫ్, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారం : మండల కేంద్రమైన జిన్నారంలో సోమవారం నాడు వీరనారి చాకలి ఐలమ్మ 127 వ జయంతి వేడు కలను టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిం చాయి. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు వెంకటేశం గౌడ్, ప్రకాశం చారి, సురేందర్ గౌడ, రాజేష్, వివిధ గ్రామాల ప్రజాప్రతినిధులు, జిన్నారం మండల స్థాయి నాయకులు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు.