Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఝరాసంగం
శైవ క్షేత్రాల్లో ఒకటైన శ్రీ కేతకీ సంగమేశ్వర దేవాలయంలో విజయదశమి దసరా సందర్భంగా శ్రీ దేవీ నవరాత్రి ఉత్సవాలను సోమవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఘనంగా ప్రారంభిం చారు. కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయ మండపంలో ప్రత్యేకమైన దేవి ఉత్స వమూర్తిని ప్రతిష్టించారు. మొదటి రోజు అమ్మవారు మంగళ గౌరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అదే విధంగా ప్రతి రోజూ ఒక రూపంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. కోవిడ్ కారణంగా మూసివేసిన అమృత గుండాన్ని ఆల య అధికారులు సోమవారం ప్రారంభించారు అమృత గుండం లింగానికి మహా రుద్రాభిషేకం నిర్వహించారు. కార్యనిర్వాహణాధికారి శశిధర్, గ్రామ సర్పంచ్ బొగుల జగదీశ్వర్ ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.