Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లా గ్రంథాలయ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత యోగ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నరహరి రెడ్డి, యోగ సమితి సభ్యులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి సోమవారం ప్రారంభించారు. అనంతరం యోగా ఆసనాలు వేశారు. పట్టణ ప్రజలు, బాలలు, గ్రంథాలయ సిబ్బంది, యోగ శిక్షకులు పాల్గొన్నారు. యోగా కోసం కావాల్సిన కార్పెట్లు, మ్యాట్లు, దాతలు అందిస్తారన్నారు. గ్రంథాలయ సంస్ధ అధ్యక్షుడు మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు,యువకులు, గ్రంథాలయ పాఠకులు, ఉచిత యోగ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవాలని ఆరోగ్యవంతులు, అయువృద్ది పొందాలన్నారు. నవాజ్ రెడ్డి, మోహన్ రెడ్డి, కొండల్ రెడ్డి, వైద్యనాత్, సోమలింగం శిక్షకులు పాల్గొన్నారు.