Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళలను ఆర్ధికంగా అభివృద్ది చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలను తీసుకువచ్చి ఆదుకుంటున్నట్టు మనోహరాబాద్ ఎంపీపీ పురం నవనీత రవిము దిరాజ్, రాష్ట్ర సర్పంచ్ల ఫోరం వర్కింగ్ ప్రసిడెంట్ చిట్కుల్ మహిపాల్రెడ్డిలు పేర్కొన్నారు. మహిళా సమాఖ్య ఐదవ వార్శికోత్సవ మహసభ కార్యక్రమాన్ని సోమవారం రోజు మండల కేంద్రంలోని పంచాయితీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా అభివీద్ది చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలను ఏర్పాటు చేసి వడ్డీలేని రుణాలను అందిస్తుందని తెలిపారు. దాంతో అనేక వ్యాపారాలు చేపట్టి ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నారు. మహిళలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో మగవారికి ధీటుగా నిలదొక్కుకుని ముందుకు సాగాలని సూచించారు. అనంతరం మహిళా సమాఖ్యలో విషిష్ట సేవలందించిన మహిళలను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ మోహన్, మండల సమైఖ్య అధ్యక్షురాలు కార్యనిర్వాహక సభ్యులు ఐసీడీఎస్ సూపర్వైజర్ వసుమతి, ఐకేపీ ఏపీఎం పెంటాగౌడ్, కార్యదర్శి రూపాగౌడ్, ఐకేపి మండల అధ్యక్షురాలు అనిత, లాలూ, సీసీలు కృష్ణవేణి, విజయలక్ష్మి, శోభారాని, దీప, అనసూయ, స్వప్న, దేవి, ఏఎన్ఎం వినోద, అంగన్వాడి టీచర్లు శంశాద్, దుర్గమని, ఆశాలు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.