Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఐడిఏ బొల్లారం
బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని 'మా అంబి మహిళా సేవా సమితి' ఆధ్వర్యంలో కలశ యాత్రను సోమవారం నిర్వహించారు. ఈ యాత్రలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దేవీ నవరాత్రులు ప్రారంభమవుతున్న సందర్భంగా బీహార్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన మహిళలు సాంప్రదాయ పద్ధతిలో భక్తిశ్రద్ధలతో అమ్మవారి కలశ యాత్రను మున్సిపల్ వీధుల్లో ఊరేగింపుగా నిర్వహించారు. అనంతరం స్థానిక దుర్గామాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రమీల, దుర్గావతిదేవి, సంగీత, అర్పిత, నాయకులు దిననాథ్, రాజారాం, చంద్రశేఖర్, జె.జె.సింగ్, రవితేజ, మా అంబీ మహిళా సేవా సమితి సభ్యులు, తదితర మహిళలు స్థానికులు, పాల్గొన్నారు.