Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ రాష్ట్ర ఫుడ్స్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి
నవతెలంగాణ/తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
పండగ పూట ఆడపడుచులు ఆనందంగా పండగను జరుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ కానుకలుగా చీరలను అందజేస్తున్నారని రాష్ట్ర మాజీ ఫుడ్స్ చైర్మన్ గంగుమల్ల ఎలక్షన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రోజు తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాలపల్లిలో మున్సిపల్ చైర్మన్ బొంది రాఘవెందర్గౌడ్తో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా కులమాతాలకతీతంగా సంక్షేమ పధకాలను అందజేస్తున్నారని తెలిపారు. మనం గజ్వేల్ నియోజక వర్గంలో ఉండడం మన అదృష్ట మని మన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి కావడంతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నా యని తెలిపారు. రంజాన్‌కు ముస్లీంలకు, క్రిస్మస్కు క్రిస్టియన్లకు, బతుకమ్మ పండగకు హిందువులకు కానుకలను అందజేస్తున్నారని తెలిపారు. పండగ పూట ఏ ఒక్కరూ కూడా బట్టలకై ఇబ్బందులు పడకూ డదని సుఖసంతోషాలతో ఆనందంగా పండగను జరుపుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్య క్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బొల్లంపల్లి బాబుల్‌రెడ్డి, కౌన్సిలర్ బొంది అరుణ వెంకట్‌గౌడ్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
నవతెలంగాణ-చేగుంట : చేగుంట, నార్సింగి మండలంలో మంగళవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. నార్సింగ్ మండలంలో మండల ఎంపీపీ చిందం సబిత రవీందర్, వైసీపీ దొబ్బల సుజాతలు, హాజరై మహిళలకు చీరలను పంపిణీ చేశారు. నార్సింగ్ మండలంలోని సంకాపూర్, వల్లూరు, గ్రామపంచా యతీ ఆవరణలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని గ్రామాల సర్పంచులు నిర్వహించారు. చేగుంట చందాయిపేట సర్పంచ్ సర్పంచ్ బుడ్డ స్వర్ణ లత భాగ్యరాజ్, నార్సింగి మండలం సంకాపూర్ సర్పంచి సుజాత శ్రీనివాస్, వల్లూరు సర్పంచి ఆనం దస్ మహేశ్వరి నరేష్, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.
నవతెలంగాణ-నిజాంపేట : మండల పరిధిలోని కే.వెంకటాపూర్ గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం కోసం బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అనంతరం గ్రామంలో ఫైలేరియా వ్యాధి సోకిన వారికి ప్రభుత్వం పింఛన్లు అందివ్వడం హర్షించదగ్గ విషయమని సర్పంచ్ తెలిపారు. గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఫైలేరియా వ్యాధి సోకిన వారికి పింఛన్ కార్డులను అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సిద్ధిరాములు, గ్రామపంచాయతీ కార్యదర్శి లక్ష్మి, ఉప సర్పంచ్ శేఖర్, వార్డు మెంబర్ అక్కల రాజు, కాసా ఆంజనేయులు, టీఆర్ఎస్ నాయకులు దయాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.