Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రంగు రాళ్లు నుంచి రసాయనాల దాకా అన్ని
- అడ్డదారుల్లోనే తరలింపు
- పన్నుల ఎగవేతే లక్ష్యంగా బిజినెస్
- కోట్లు గడిస్తున్న ట్రావెల్స్, లారీల నిర్వాహకులు
- రాష్ట్ర ఆదాయానికి భారీ గండి..
నవతెలంగాణ-జహీరాబాద్
వాణిజ్య పన్నులు చెల్లించకుండా కర్ణాటక, మహరాష్ట్రలోని వివిధ సిమెంటు పరిశ్రమల నుంచి సామగ్రిని లారీల్లో రాత్రి వేళల్లో జహీరాబాద్ ప్రాంతానికి దిగుమతి చేస్తున్నారు. ఇటివలే ప్రభుత్వం నిర్వహించిన టాస్కుఫోర్సు దాడుల్లో ఈ విషయం నిజమని తేట తెల్లమైంది. కొన్ని ట్రెడింగ్ వ్యాపార సముదాయలపై కేసులు కూడా నమోదు చేశారు. అక్రమార్గాల్లో వచ్చిన లారీలను కాపు కాచి వాణిజ్య పన్నుల శాఖ అధికారులు సీజ్ చేశారు. అయితే ట్రావేల్స్ బస్సుల్లో ప్రయాణికుల కంటే ఎక్కువగా లగేజీనే తరలిస్తుంటారు. ఈ లగేజీల్లో అక్రమంగా సామగ్రిని తరలిస్తున్నారని పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ రహదారి 65పై ఉన్న ముంబాయి, హైద్రాబాద్ మధ్య తిరుగుతున్న బస్సుల్లో పెద్ద ఎత్తున అక్రమ సరకు రవాణా అవుతోంది. నిషేదిత, పన్ను కట్టని వస్తువులు దిగుమతి అవుతున్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు గ్రామాలైన చిరాగ్పల్లి, బరూర్, బూచినేల్లి, మామిడ్గి, చిరాగ్ పల్లి, బీదర్ , మెటల్ కుంట గ్రామల్లోని అటాచ్ రోడ్డులతో పాటు జాతీయ రహదారిపై ఉన్న దాబాల ఆవరణాలో అక్రమంగా తీసుకువచ్చిన సరుకును ఈ బస్సుల నుంచి దించు తురు. అక్కడి నుంచి విలువైన వస్తువులైన ల్యాబ్ ట్యాబ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు , వైద్య పరికరాలు, వివిద రకాలు మందుల తయారి సామగ్రి, రసాయనాలను మాత్రం యథేచ్చగా తరలిస్తున్నారు. మిగిలిన వాటిని వివిధ వాహనాల ద్వారా తరలిస్తుంటారు.
అడ్డదారులు..
ముంబాయి, హైదరాబాద్ మధ్య నిత్యం వందల సంఖ్యలో వివిద ట్రాన్స్‌పోర్టులకు చెందిన ట్రావేల్స్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే కొందరు నిర్వాహకులు బస్సుల పైన, అడుగు భాగాల్లో భారీ క్యాబిన్లు ఏర్పాటు చేసి.. వాటిల్లో నిషేదిత పన్ను కట్టని వస్తువులు తీసుకు వస్తున్నారు. ముంబాయి నుంచి హైదరాబాద్‌కు రావాలంటే తెలంగాణ, కర్ణాటక సరిహద్దులోని రవాణ, వాణిజ్య, పన్నుల శాఖ చెక్‌పోస్టు తనిఖీ కేంద్రాన్ని దాటాలి. కానీ ఇక్కడే ట్రావేల్స్ నిర్వహకులు తమ పన్నాగం అమలు చేస్తున్నారు. ఈ చెక్‌పోస్టు తగలకుండా 65 జాతీయ రహదారిపై ముంబాయి, హైదరబాద్ మార్గంలో వచ్చే ట్రావేల్స్ బస్సులు బరూర్, మామిడ్గి, బుచినేల్లి, ధనసిరి, ఇప్పేపల్లి, హౌతి(బి), మొగుడంపల్లి, మన్నాపూర్, చిన్నా హైదరబాద్ మీదుగా జహీరాబాద్ చేరుకుంటున్నాయి. అక్కడినుంచి యథేచ్ఛగా హైదరబాద్ చేరకుంటాన్నాయి.
ప్రభుత్వనికి రోజుకు లక్షల్లో ఆదాయం గండి..
ముంబాయి, హైదరాబాద్ మధ్య తిరిగే వివిధ ట్రావేల్స్ నిర్వాహకులు చేస్తున్న ఈ దందాతో ప్రభుత్వానికి రోజుకు లక్షల్లో గండిపడుతున్నది. బస్సు సామర్థ్యాన్ని బట్టి స్లీపర్ కోచ్ 25, యాక్సిల్, మల్టీ యాక్సిల్ బస్సుల్లో 32, 36, 45 సీట్లు బిగిస్తున్నారు. ఇందులో భాగంగా ఒక్కో సీటుకు ప్రతీ మూడునెలలకొకసారి రూ.3,675 చొప్పున రవాణ శాఖకు పన్ను చెల్లించాల్సి ఉంటు ంది. అయితే ప్రజలను తరలించడమే కాకుండా.. అడ్డదారిలో పన్ను ఎగవేత సామగ్రిని తరలించడం వీరు వ్యాపారంగా చేసుకున్నారు. పేరుకు ట్రావెల్స్ అని ఉన్నప్పటికీ.. తరలించేది అంతా అక్రమ సరుకులే. ముంబ ాయి మార్కెట్ నుంచి చౌకగా లభ్యమయ్యే అలంకరణ సామగ్రిని పన్ను ఎగ్గొట్టి రాష్ట్రానికి తరలిస్తున్నారు. కొన్ని ట్రావేల్స్ చెక్‌పోస్టు దగ్గర ఉన్న అధికారులకు నెలనెలా మాముళ్లు ఇస్తుండడంతో.. బస్సు అక్కడికి రాగానే సిగల్స్ ఇస్తూ వెళ్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులకు 9 శాతం వాణిజ్య పన్నులు చెల్లించాల్సి ఉన్నప్ప టికీ చెల్లించకుండా అడ్డదారల్లో తరలిస్తున్నారు. అలాగే వైద్య సామగ్రి, రసాయనాలు,మందుల తయారికి కావల్సిన వివిద ముడి సరుకులు, ఆపరేషన్ పరికరాల్లాంటి వారికి అసలు పన్నులే కట్టకుండా తీసుకువస్తున్నట్టు సమాచారం.
అన్నింటికి ఏజెంట్లు..
ముంబాయి నుంచి హైదరాబాద్‌కు సరుకు చేరవేసేందుకు ఒక్కో ట్రావెల్స్ కంపెనీకి ఒక్కో ఏజెంటు ఉంటాడు. సామగ్రి విలువను బట్టి అతడు డబ్బులు తీసుక ుని సరుకును బార్డర్ దాటవేస్తాడు. అయితే కొన్ని నిషేదిత వస్తువులకు మాత్రం ప్యాకేజి మాట్లాడుకుని అధికారులు వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ఒకే పర్మిట్‌పై 4 బస్సులు..
ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే పర్మిట్‌పై రెండు నుంచి నాలుగు బస్సులకు నడిపిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీరు ప్రతీ చెక్‌పోస్టుకు నెలనెలా ప్యాకేజీల రూపంలో డబ్బు లు చెల్లిస్తుంటారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
జహీరాబాద్‌కు కర్ణాటక నుంచి పెట్రోల్, డీజిల్..
కర్ణాటక రాష్ట్రంలో ఇక్కడి కంటే పెట్రోల్, డీజిల్ ధరల మధ్య లీటర్‌కు రూ.10 వ్యత్యాసం ఉంటుంది. దీంతో పలువురు కర్ణాటక నుంచి పెట్రోల్, డీజీల్‌ను జహీరాబాద్ మీదుగా రాష్ట్రంలోకి తరలిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వనికి రావల్సిన పన్నులతో పాటు వివిద రకాల సుంకాలు రావట్లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని.. ఈ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.
అక్రమ రవాణాకు రాచబాటగా జహీరాబాద్
తెలంగాణ, కర్ణాటక, మహరాష్ట్రల సరిహ ద్దులోని జహీరాబాద్ ప్రాంతం అక్రమ సరకు రవాణకు రాచబాటగా మారింది. పన్నులను ఎగ్గొట్టి వివిధ రాష్ట్రాల నుంచి సామగ్రిని జహీరాబాద్ మీదుగా రాష్ట్రంలోకి తీసుకువస్తున్నారు. రాత్రికి రాత్రే డంపు చేసి.. తెల్లారి వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రతీ రోజు లక్ష ల్లో రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. పన్నులను ఎగ్గొట్టి అక్రమ దారుల్లో దందాను సాగిస్తున్నారు.రంగు రాళ్లు నుంచి రసా యనాల దాకా.. మద్యం నుంచి పెట్రోల్ దాకా ప్రతీ ది అడ్డదారుల్లోనే సరఫరా చేస్తూ కోట్లు కొల్లగొడు తున్నారు. ఇప్పటికైన అధికారులు సీరియస్‌గా వీటిపై ఓ నజర్ వేయాలి సుమా...