Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దామోదర్‌కు ఎమ్మెల్యే చంటిక్రాంతి కిరణ్ సవాల్
నవతెలంగాణ-జోగిపేట
నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహకు అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ సవాల్ విసిరారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలోనే అందోలు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివద్ది చెందిందన్నారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ది పనులు జరగలేవంటూ దామోదర రాజనర్సింహ తప్పుడు ప్రచారం చేస్తూ.. ప్రజలను తప్పుదొవపట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నాని ఆరోపించారు. 2014 కంటే ముందు గ్రామాల్లో జరిగిన పనులు, కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అభివృద్దిపై తాను బహిరంగ చర్చకు సిద్దంగా ఉన్నానని, కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా ఉన్న గ్రామాన్నే ఎంపిక చేసి చర్చ పెడుదామని సవాల్ విసిరారు. దామోదర్ ఓటమి భయంతోనే ప్రజలను తప్పుదొవపట్టించే ప్రయత్నం చేస్తున్నారని, రాబోవు రోజుల్లో టీఆర్ఎస్ పార్టీనే అధికా రంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రామాలా భివృద్ది కోసం సలహాలు, సూచనలు ఇస్తే బాగుంటుందని, తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పదొవ పట్టించొద్దని హితవు పలికారు. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ఆగ్రగామిగా మన రాష్ట్రాన్ని నిలబెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కెసిఆర్ పై ప్రజలకు నమ్మకం ఉందని, వచ్చే ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, ఆయనపై లేనిపోని అవాసగా ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వసించారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ జోగు బాలయ్య, మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, అత్మకమిటీ చైర్మన్ యాదగిరి రెడ్డి, అందోలు, టేక్మాల్ మండలాల పార్టీ అధ్యక్షులు లక్ష్మికాంత్ రెడ్డి, వీరప్ప, ముది రాజు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. నారాయణ, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కృష్ణాగౌడ్, పుల్కల్ రైసస అధ్యక్షుడు నర్సింహ్మ రడ్డి, మాజీ ఎంపీపీ రామ గౌడ్, పట్టణ పార్టీ అధ్యక్షుడు సార శ్రీధర్, కొ అప్షన్ మెంబర్ యాదుల్, నాయకులు లక్ష్మణ్, శ్రీనివాస్ యాదవ్, నరసింహారెడ్డి, అనిల్ రెడ్డి, మొగులయ్య, రాజు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.