Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుమ్మడిదల
మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చేతులు మీదుగా బతుకమ్మ చీరలు, కొత్త పెన్షన్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతీ ఆడబిడ్డ బతుకమ్మ పండుగ రోజున కొత్త చీరలను కట్టుకుని సంతోషంగా పండుగ జరుపు కోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం అభినందనీ యమన్నారు. పటాన్ చెరువు మార్కెట్ కమిటీ చైర్మెన్ విజ రు కుమార్, ఎంపీపీ సద్ది ప్రవీణ,జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీడీవో చంద్ర శేఖర్, ఉపసర్పంచ్ డాకూరి మొగులయ్య, ఎంపీఓ దయాకర్ రావు, కార్యదర్శి దేవేందర్ గౌడ్, ఎంపిటిసి చీదు పద్మ,వార్డు సభ్యులు కాలకంటి రవీం దర్ రెడ్డి, కాలకంటి పార్వతమ్మ, బోయ జ్యోతి, కాకర్ల లలిత, ఆకుల సత్యనారాయణ,ఆకుల ఆంజనేయులు, పెద్దోల అనసూజ, సరెడ్డిగారి జయపాల్ రెడ్డి, కల్పగురి అనిత, అతినారమ్ రాము, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
పటాన్చెరు : మండలంలోని రుద్రారం గ్రామపంచాయతీ ఆవరణలో ఏర్పాటుచేసిన చీరల పంపిణీ కార్యక్రమంలో మహిళలకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆడపడుచులందరు ఆనందో త్సాహాల మధ్య పండుగ నిర్వహించుకోవాలని బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశా రు. ఎంపీపీ సుష్మ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్పిటిసి సుప్రజా వెంకట్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మెన్ విజరుకు మార్, సర్పంచ్ సుధీర్‌రెడ్డి, తహసీల్దార్ మహిపాల్‌రెడ్డి, ఎం పిటిసి రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రడ్డి, మండలాధ్యక్షులు పాండు తదితరులు పాల్గొన్నారు.
ఐడిఏబొల్లారం : తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పం డుగను ఘనంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభు త్వం చీరల పంపిణీ చేస్తోందని టీఆర్ఎస్ సీనియర్ నాయ కులు, మున్సిపల్ కౌన్సిలర్ వి.చంద్రారెడ్డి అన్నారు. మంగళ వారం మున్సిపాలిటీలోని 5, 16వ వార్డుల్లోనీ మహి ళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. బతుకమ్మ పండుగ విశిష్ఠతను ప్రపంచానికి చాటిన ఘనత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకే దక్కుతుందని వి.చంద్రారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ రాధా, నాయకులు గోపాల్‌రెడ్డి, శేఖర్, సాయి, వెంకటేష్ స్థానిక మహిళలు పాల్గొన్నారు.