Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన తొలి, మలి దశ పోరాటాల్లో కీలక పాత్ర పోషించడంతోపాటు తన జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం త్యాగం చేసిన మహౌన్నత వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని ఆయన జీవితం నేటి తరా నికి ఆదర్శప్రాయమని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిb ాల్ రెడ్డి కొనియాడారు. పటాన్ చెరు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి తరానికి కొండా లక్ష్మణ్ బాపూజీ చరిత్రన ు తెలియజేయాలన్న లక్ష్యంతో పటాన్ చెరు బస్టాండ్ ఆవర ణలో విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజరు కుమార్, సీఐ వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, శ్రీధర్ చారి, శీనయ్య, పద్మశాలి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఐడిఏబొల్లారం : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను మంగళవారం బొల్లారం మున్సి పాలిటీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాపూజీ చిత్రపటానికి టిఆర్ఎస్ యువత నాయకుడు వి.ప్రవీణ్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులు, చేనేత సహకార ఉద్యమ పితమహుడు, నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన బాపూజీ, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమ సారధి తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. నాయకులు చంద్రారెడ్డి , చంద్రానాయక్, రవితేజ, నాగిరెడ్డి, దిగంబర్, సురేశ్, ఆజామ్, ప్రశాంత్ రెడ్డి , ఆంజనేయులు, సంజరు, జాశ్వా తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ : ఆచార్య శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతోత్సవాలను అమీన్ పూర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు మసుర ఆగమయ్య అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్య క్షులు మసుర ఆగమయ్య మాట్లాడుతూ బాపూజీ దేశ స్వాతం త్య్రం కోసం, తెలంగాణ రాష్ట్రము కోసం అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప యోధులు అని కొనియాడారు. అయ న ఆశయ సాధన కొరకు అందరూ కృషి చేయాలి అవసరం ఎంతో ఉందన్నారు. మన అమీన్ పూర్ పట్టణంలో బాపూజీ విగ్రహం ప్రతిష్టాపించాలని అయన కోరారు. సంఘం సలహాదారులు తలకొక్కుల కుమార స్వామి , ప్రధాన కార్య దర్శి ఆనందపు మహేందర్ , ఉపాధ్యక్షులు బత్తుల కనకా ావు, కోశాధికారి భామిని జోగినాథ్ , సీత మధు , కందుగట్ల శ్రీనివాస్, మాకం బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.