Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పటాన్చెరు
పటాన్చెరు పట్టణానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ అబ్దుల్ బాసిత్.. బహుజన సాహితి అకాడమీ వారు ప్రతి ఏటా నిర్వహించే అవార్డుకు ఎంపికైనట్టు నేషనల్ అవార్డు సేలక్షన్ కమిటీ చైర్మెన్ నల్ల రాధాకృష్ణ తెలిపారు. నగరంలోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అవార్డు ఎంపిక ఆహ్వాన పత్రాన్ని సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా బాసిత్ మాట్లాడుతూ.. నవంబర్ 13న దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే ఆల్ ఇండియా బహుజన రైటర్స్ మూడో నేషనల్ కాన్ఫరెన్స్ లో దేశ నలుమూలల 26 రాష్ట్రాల నుంచి సుమారు 2000 మంది డెలిగేట్స్ పాల్గొం టారన్నారు. ఈ అవార్డు ప్రతిఏటా ప్రజా ఉద్యమ కారులు, సంఘ సేవకులకు, కవులకు, పత్రికా రంగాల వారికి స్వచ్ఛంద సేవా సంస్థలకు అందజేస్తారన్నారు. విద్యార్థి దశ నుండి చేపట్టిన సామాజిక ఉద్యమాలు, సామాజిక అవగా హన కార్య్రమాలు, పాత్రికేయుడిగా గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా అనేక వార్తలను అందించి ప్రజా సమస్యలే పరిష్కారంగా కృషి చేసిన సందర్భంగా బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, ఈ అవార్డుకు ఎంపిక చేయడం సామాజిక బాధ్యతను మరింతగా పెంచిం దన్నారు. ఈ అవార్డుకు సహకరించిన ప్రతీ ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.