Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండాపూర్
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట 65రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు సీఐటీయూ, అనుబంధయూనియన్ గ్రామపంచాయతీ కార్మి కులు మంగళవారం సంఘీభావం తెలిపారు. ఈ సందర్భం గా సీఐటీయూ అనుబంధ గ్రామపంచాయతీ కార్మికుల యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాబురావు మాట్లా డుతూ.. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 65 రోజులు గా వీఆర్ఏలు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం సరికాదన్నారు. చర్చల సంద ర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు సైతం అమలుకు నోచుకోకపోవడం విడ్డూరమన్నారు. వీఆర్ఏలు చనిపో తున్నా ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మండిపడ్డారు. వీఆర్ఏలతో వెట్టి చాకిరి చేయిస్తూ వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. హామీలను అమలు చేసే వరకు ఈ దీక్షలను కొనసాగిస్తా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దిగిరాకపోతే వీఆర్ఏల పక్షాన తమ సంఘం పోరాటం నిర్వహిస్తుందన్నారు. సీఐటీయూ నాయకులు, వెంకయ్య, అంజయ్య, ఉస్మాన్, సంజీవులు, బాలరాజు, విఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.