Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
- జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
నవతెలంగాణ-సంగారెడ్డి
జిల్లాలో ప్రసవాలన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్ డాక్టర్ శరత్ సూచించారు. ఈ విష యంలో ఏఎన్ఎంలు, ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు క్షేత్రస్థా యిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగ ళవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ ఎంలు, సీడీపీఓలు, సూపర్వైజర్లు, వైద్యాధికారులతో వైద్య ఆరోగ్యశాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో పీహెచ్సీ వారీగా సాధించిన ప్రగతిని ప్రస్తావిస్తూ, పని తీరు లో వెనుకబడి ఉన్న వారిని సున్నితంగా మందలించారు. ఏప్రి ల్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పీహెచ్సి వారీగా ఎన్ని ఈడీడీలు, జరిగిన కాన్పులు, అందులో ప్రభుత్వ, ప్రైవే ట్ ఆస్పత్రులలో జరిగినవి, అందులో సెక్షన్స్, నార్మల్ డెలివ రీలు ఎన్ని అనే వివరాలను ఆరా తీశారు. సరియైన వివరాలు చెప్పడంలో తడబడిన వారిపై అసంతప్తి వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు రావాలని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు ప్రాధాన్యత అంశంగా భావించాలన్నారు. కనీసం 80 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా పక్కగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. మహిళ గర్భం దాల్చిన నాటి నుండి కాన్పు అయ్యేంతవరకు ఆమె ఆరోగ్య పరిరక్షణ పట్ల ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్ వాడి కార్యకర్త సమన్వయము చేసుకోవాలని సూచించారు. గర్భిణీల్లో రక్తహీనత లేకుండా చూడాలన్నారు. వారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునేలా పకడ్బందీ పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. ప్రసవం జరిగిన వెంటనే కేసీఆర్ కిట్ ఇవ్వాలన్నారు. జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ , బూస్టర్ డోస్ పంపిణీలో వైద్య ఆరోగ్యశాఖ డాక్టర్లు, ఏఎన్ఎంలు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు అందరూ కష్టపడ్డారని,వారందరినీ అభినందిస్తున్నానన్నారు. బూస్టర్ డోస్ 95 శాతం పూర్తయిందని, మిగిలిన 5 శాతాన్ని పూర్తి చేయాలని కోరారు. వారంలో ఒకరోజు విధిగా అంగన్వాడి డే నిర్వహించాలన్నారు. ప్రతీ వారం తాను వైద్య శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహిస్తానని, పనితీరు మెరుగుపరుచుకోని వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. అదనపు కలెక్టర్ రాజర్షి షా, డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ గాయత్రి దేవి, డీసీహెచ్ఎస్ సంగారెడ్డి, మహిళా శిశు సంక్షేమశాఖ అధికారి పద్మావతి,మెడికల్ ఆఫీసర్లు, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు, మెడికల్ సూపర్వైజర్లు, సీడీపీఓలు, ఏఎన్ఎంలు, తదితరులు పాల్గొన్నారు.