Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద ఎఐఎస్ఎఫ్, ఎఐవైఎఫ్ ఆద్వర్యంలో భారత దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన భగత్ సింగ్ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పండ్ల పంపిణీ చేశారు. భగత్ సింగ్ జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నాయకులు తాడిచెట్టు హరీశ్, దొంతరవేణి మహేష్ డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-సిద్దిపేట
భారత స్వాతంత్య్ర పోరాట యోధుడు, నేటి విద్యార్థులకు స్ఫూర్తి భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అంబెడ్కర్ చౌరస్తా వద్ద భగత్ సింగ్ 115 వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ వారిని ఎదిరించి, తన ప్రాణాన్ని అవలీలగా వదిలిన పోరాట యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. ఏ చరిత్ర లేని వారిని రాజకీయ స్వలాభాల కోసం పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశాలుగా చేరుస్తున్నారని, గొప్ప దేశభక్తుడైన భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో ఎందుకు చేర్చరని ప్రశ్నించారు. భగత్ సింగ్‌కు భారతరత్న ప్రకటించి, అధికారికంగా ప్రభుత్వమే భగత్ సింగ్ జయంతి , వర్ధంతి ఉత్సవాలను జరపాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రాల్లో భగత్ సింగ్ విగ్రహాలను ఏర్పాటు చేయాలని కోరారు. భగత్ సింగ్ వారసులుగా ఎస్ఎఫ్ఐ నాయకులు రాష్ట్రం, దేశంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండం సంజీవ్, ఆముదాల రంజిత్ రెడ్డి, నాయకులు సంతోష్, భాను, శివ, వంశీ, సంతు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-గజ్వేల్
భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) గజ్వేల్ డివిజన్ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో భగత్ సింగ్ 115వ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్బంగా నాగార్జున జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో డివైఎఫ్ఐ మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య పాల్గొని భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భగత్ సింగ్ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర వహించి, మాతృ దేశ విముక్తి కోసం ఉరి కంబన్నీ సైతం చిరుతునవ్వుతో ఎక్కాడన్నారు. అతడు నేటి సమాజానికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గజ్వేల్ డివిజన్ అధ్యక్షులు నాచారం శేఖర్, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
శేరిపల్లి గ్రామంలో...
గజ్వేల్ మండలంలోని శేరిపల్లి గ్రామంలో ఎస్ఎఫ్ఐ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 115 వ జయంతి నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ నాయకులు కరుణాకర్ మాట్లాడుతూ భగత్ సింగ్ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర వహించి, మాతృ దేశ విముక్తి కోసం ఉరి కంబాన్ని సైతం చిరు నవ్వుతో ఎక్కాడని, అతడు నేటి సమా జానికి ఆ దర్శమ న్నారు, ఈ కార్యక్ర మంలో ఎస్ఎఫ్ఐ నాయ కులు కార్తి క్, రాజు, రేణు క, కల్పన, కళ్యా ణి తదితరులు పాల్గొ న్నారు..
బల్పాలతో భగత్‌సింగ్ చిత్రం..
భగత్ సింగ్ 115వ జయంతిని పుర స్కరించుకుని భగత్ సింగ్ చిత్రా న్ని వినూత నం గా బల్పాలతో
క ళా నైపుణ్యాన్ని
ఉపయోగించి అ ద్భుతంగా చిత్రిం చి రామకోటి కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించి ఘన నివాళులు అర్పించారు. గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు చిత్రీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 23 ఏళ్ల వయసులో నిండు నూరేళ్ల జీవితాన్ని ఆనందంగా ఉరికంబానికి అంకితం చేసిన మహా దేశభక్తుడు భగత్ సింగ్ అన్నారు. దేశం కోసం ప్రేమగా చూసుకొనే కుటుంబాన్ని పట్టించుకోలేదన్నారు. తూటాలకు చీలిపోయినా శరీరాన్ని పట్టించుకోలేదన్నారు.
నవతెలంగాణ-నంగునూరు
నంగునూరు మండల కేంద్రంలో భగత్ సింగ్ 115 వ జన్మ దిన వేడుకలను భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. బుధవారం ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో భగత్ సింగ్ యూత్ సభ్యులు పాల్గొన్నారు.