Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిద్దిపేట
బడుగు, బలహీన వర్గాల చైతన్యం కొరకు కలం కదిలించి రచనలు చేసిన కవి గుర్రం జాషువా అని, సమాజం మరువలేని కవి అని జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి అన్నారు. జాషువా జయంతి సందర్భంగా పట్టణంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ జాషువా గబ్బిలం, స్వప్నకథ, పిరదౌసి, ముంతాజ్ మహల్, బాపూజీ, నేతాజీ, క్రీస్తు చరిత్ర వంటి పలు రచనలు చేసి, కవితా విశారద, కవికోకిల, నవయుగ కవిచక్రవర్తి, మధుర శ్రీనాథ, విశ్వకవి సామ్రాట్ గా బిరుదులతో ప్రసిద్ధుడైనాడన్నారు. జాషువా రాసిన అనేక రచనలు జనం ఇప్పటికి గుర్తించుకున్నారన్నారు. బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం మాట్లాడుతూ నవయువ కవి చక్రవర్తిగా జాషువా ఎప్పటికీ చిరస్మరణీయులన్నారు. ఈ కార్యక్రమంలో కవులు వరుకోలు లక్ష్మయ్య, మిట్టపల్లి పర్శరాములు, సింగీతం నరసింహారావు, గంగాపురం శ్రీనివాస్, శ్రీచరణ్ సాయిదాస్, కోణం పర్శరాములు, యాడవరం చంద్రకాంత్ పాల్గొన్నారు.