Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిడ్జి నిర్మాణంకు వ్యతిరేకంగా వేసిన
- కేసును వెనక్కు తీసుకున్న భాస్కర్ రెడ్డి
- త్వరలో పూర్తికానున్న బ్రిడ్జి నిర్మాణం
నవతెలంగాణ-తొగుట
ఎన్నో ఏళ్లుగా కోర్టులు, కేసులు, వివాదాలతో పెండింగులో ఉన్న అల్వాల-కాన్గల్ బ్రిడ్జి నిర్మాణంకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కృష తో గ్రహణం వీడిందని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ తన పట్టా భూమిలో బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారని కాన్గల్కు చెందిన రైతు బాసిరెడ్డి పద్మజ-భాస్కర్ రెడ్డి గతంలో కోర్టును ఆశ్రయించడంతో మూడేళ్ళుగా బ్రిడ్జి నిర్మాణం పనులు నిలిచి పొయాయని తెలిపారు. వర్షాకాలంలో కూడవెళ్లి వాగు పొంగి పొర్లడం వల్ల పాత బ్రిడ్జి మీదుగా నీళ్లు ప్రవహించడోం రాకపోకలు నిలిచిపోయాయన్నారు. కొద్ది రోజుల క్రితం ఈ ప్రవాహంలో ఒక వ్యక్తి వాగులో కొట్టుకుపోయి మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని, బ్రిడ్జి నిర్మాణ ఆవశ్యకతను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎంపీ కొత్త భాస్కర్ రెడ్డి రైతు భాస్కర్ రెడ్డికి వివరించారు. దీనిపై రైతు భాస్కర్ రెడ్డి కేసు వాపసు తీసుకుంటానని, బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లిఖిత పూర్వకంగా ఆమోదం పత్రం వ్రాసి ఇచ్చా డు. కోరిన వెంటనే బ్రిడ్జి నిర్మాణంకు ఆమోదం తెలిపిన రైతును ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ప్రజలు అభినందించారు.