Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారు వైద్యం మరింత చేరువ
నవతెలంగాణ-హుస్నాబాద్
మెరుగైన వైద్యం అందించడమే కాదు, మరింత చేరువ చేసే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తోంది. మంత్రి హరీశ్ రావు చొరవ, ఎమ్మెల్యే సతీశ్ కుమార్ కృషితో హుస్నా బాద్‌కు బస్తీ దవాఖాన మంజూరైంది. రోజురోజుకూ హుస్నాబాద్ పట్టణ పరిధి పెరుగడంతో పాటు జనాభా కూడా పెరుగుతోంది. ఇందుకు అనుగు ణంగా పట్టణాల్లో ఎక్కడికక్కడే మెరుగైన వైద్యసేవ లందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసు కుంటోంది. 5 వేల నుంచి 10 వేల జనాభాకు అనుగుణంగా బస్తీ దవాఖా నాలను ఏర్పాటు చేస్తోంది. మంత్రికి ధన్య వాదాలు తెలిపిన ఎమ్మెల్యే సర్కార్ దవాఖానలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతున్నాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. హుస్నాబాద్‌లో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలన్న ఆలోచన హర్షణీయమన్నారు. ఇక్కడి ప్రజలకు వైద్యాన్ని మరింత అందుబాటులో తెచ్చారని మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.